Narendra Modi: మై ఫ్రెండ్‌ అంటూ డొనాల్డ్‌ ట్రంప్‌కి మోదీ శుభాకాంక్షలు

ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడం కోసం, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దామని అన్నారు.

Narendra Modi: మై ఫ్రెండ్‌ అంటూ డొనాల్డ్‌ ట్రంప్‌కి మోదీ శుభాకాంక్షలు

Donald Trump and Modi

Updated On : November 6, 2024 / 2:00 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌కి హృదయపూర్వక అభినందనలు” అని మోదీ పేర్కొన్నారు.

డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోలాగే ఇప్పుడు కూడా భారత్‌-అమెరికా మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని, ఇరు దేశాల గ్లోబల్, వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడం కోసం, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దామని అన్నారు. గతంలో ట్రంప్‌తో దిదిన ఫొటోలను ఈ సందర్భంగా మోదీ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

కాగా, గతంలో మోదీ, ట్రంప్ స్నేహబంధాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే. అప్పట్లో వారిద్దరు కలిసి అమెరికాలో హౌడీ మోదీ, భారత్‌లో నమస్తే ట్రంప్‌ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని అప్పట్లో చెప్పారు.

రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై ట్రంప్.. ఎలాన్ మస్క్ కు కలిగే ప్రయోజనాలు ఇవేనా..!