రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై ట్రంప్.. ఎలాన్ మస్క్ కు కలిగే ప్రయోజనాలు ఇవేనా..!

అమెరికా అధ్యక్ష పీఠాన్ని రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ అధిరోహించనున్నాడు. ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ రావడంతో రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్ష పీఠంపై ..

రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై ట్రంప్.. ఎలాన్ మస్క్ కు కలిగే ప్రయోజనాలు ఇవేనా..!

US elections 2024

Updated On : November 6, 2024 / 1:46 PM IST

Elone Musk : అమెరికా అధ్యక్ష పీఠాన్ని రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ అధిరోహించనున్నాడు. ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ రావడంతో రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్ష పీఠంపై ట్రంప్ కూర్చోనున్నాడు. ట్రంప్ విజయంలో టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక భూమిక పోషించారని చెప్పొచ్చు. మొదటి నుంచి ట్రంప్ కు అండగా ఉంటూ వస్తున్న మస్క్.. పెద్దమొత్తంలో విరాళాలు అందజేశాడు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తానని, అలా కానిపక్షంలో తన సలహాదారుడిగానైనా నియమించుకుంటానని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ దీనిపై స్పందిస్తూ.. డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి నేతృత్వం వహించేందుకు సిద్ధమని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ గణనీయమైన ప్రయోజనాలను పొందుతాడని ఎన్బీసీ ఎన్‌బిసి న్యూస్ నివేదించింది.

Also Read: ఇది అమెరికన్లు గర్వించే విజయం: అమెరికా అధ్యక్షుడిగా గెలుపుపై డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రసంగం

ట్రంప్ ప్రచార సీనియర్ సలహాదారు బ్రియాన్ హ్యూస్ ఎన్సీబీతో మాట్లాడుతూ.. మా ప్రభుత్వం మరింత సమర్ధవంతంగా పనిచేస్తుందని, అమెరికా పన్ను చెల్లింపుదారుల డాలర్లను సమర్ధవంతంగా ఉపయోగిస్తుందని నిర్దారించే ‘కమిషన్’కి మస్క్ నాయకత్వం వహించాలని ట్రంప్ కోరుకుంటున్నారని చెప్పారు. ట్రంప్ చెప్పినట్లుగా ఎలాన్ మస్క్ ఒక మేధావి, ఆవిష్కర్త అని బ్రియాన్ హ్యూస్ చెప్పుకొచ్చాడు. ఇదిలాఉంటే.. డొనాల్డ్ ట్రంప్ పన్ను తగ్గింపులు మస్క్ కు అనుకూలంగా ఉండొచ్చు. కార్పొరేషన్లు, మస్క్ వంటి సంపన్న వ్యక్తులకు తక్కువ పన్ను రేట్లను కొనసాగించాలనే ఉద్దేశం గురించి ట్రంప్ బహిరంగంగా చెప్పారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత.. 2017లో కార్పొరేట్ పన్ను రేటును 35శాతం నుంచి 21శాతంకు తగ్గించాడు. అయితే, ఈసారి అధికారంలోకి వస్తే.. మరోసారి తన అసాధారణ పన్ను సంస్కరణ ప్రణాళికను ముందుకు తెస్తానని ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని సంపన్న దాతలతో ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే.

 

ట్రంప్ రెండోసారి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైనందున ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ డిఫెన్స్ డిపార్ట్ మెంట్.. నాసాతో ఒప్పందాలతో సహా ప్రభుత్వ ఒప్పందాలలో సంవత్సరానికి బిలియన్లను పొందుతుందని అంచనా. బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక.. వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి, బయటకు తీసుకురావడానికి స్పేస్ఎక్స్ నాసాకు ఏకైక ఎంపికగా మిగిలిపోతుంది. అదేవిధంగా జో బైడెన్ హయాంలో ఫెడరల్ ఏజెన్సీలతో పలు వివాదాల్లో మస్క్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎన్సీబీ న్యూస్ నివేదిక ప్రకారం.. 12 వేరువేరు ప్రభుత్వ సంస్థల నుంచి 19 కేసులు ఉన్నాయి. టెక్సాస్ వన్యప్రాణుల ఆశ్రయం సమీపంలోని స్పేస్ ఎక్స్ లాంచ్ సైట్ లోని పర్యావరణ సమస్యల నుండి కాలిఫోర్నియా టెస్లా ఫ్యాక్టరీలో ఆరోపించిన జాతిపరమైన వేధింపులు వరకు ఉన్నాయి. టెస్లా రూపొందించిన డ్రైవర్ – సహాయక సాప్ట్ వేర్ ను స్వయంగా మార్కెటింగ్ చేసుకునే ప్రయోజనాలను పొందవచ్చు. వీటితోపాటు ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తుండటంతో అనేక విధానాలుగా మస్క్ కు మేలు జరుగుతుందని నివేదిక పేర్కొంది.