Sunita Williams: నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్-9 రాకెట్.. భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్.. ఎప్పుడు వస్తారంటే?

కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్- 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

Sunita Williams: నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్-9 రాకెట్.. భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్.. ఎప్పుడు వస్తారంటే?

Falcon 9 rocket

Updated On : March 15, 2025 / 7:00 AM IST

Sunita Williams: దాదాపు తొమ్మిది నెలలుగా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్న విషయం తెలిసిందే. వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూ వస్తున్నాయి. దీంతో సునీతా విలియమ్స్ భూమిపై కాలుమోపే సమయం వాయిదా పడుతూ వస్తోంది. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా – స్పేస్ ఎక్స్ లు క్రూ-10 రాకెట్ ను మూడు రోజుల క్రితం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాయి. అయితే, వాతావరణం అనుకూలించకపోవటంతోపాటు సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడింది. తాజాగా.. మరోసారి క్రూ-10 మిషన్ ప్రయోగం చేపట్టారు.

Also Read: Horoscope Today : ఈ రాశుల వారు ఆర్థికంగా లబ్ది పొందుతారు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి..!

కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్- 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. డ్రాగన్ క్యాప్సుల్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగాముల్లో అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. అయితే, మార్చి 19 నాటికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరే అవకాశం ఉందని నాసా తెలిపింది. అన్నీ అనుకూలిస్తే ఈనెల 20 తరువాత సునీత, బుచ్ భూమికి చేరుకోనున్నారు.

Also Read: Gold Bond: గోల్డ్‌లో పెట్టుబడి పెట్టారా? 2016-17 సిరీస్ IV రిడెంప్షన్‌ ధరను ప్రకటించిన ఆర్‌బీఐ.. ఎంతంటే?

బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో 2024 జూన్ 5న సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు. ఆ తరువాత స్టార్ లైనర్ లో సమస్యలు తలెత్తడంతో వారు లేకుండానే ఇది భూమిపైకి చేరింది. దీంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ విఫలమవుతున్నారు. తాజాగా.. నాసా, స్పేస్ ఎక్స్ లు క్రూ-10 మిషన్ ను చేపట్టాయి. నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి పంపించారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే మార్చి 20వ తేదీ నాటికి వ్యోమగాములు భూమిపైకి అడుగుపెట్టే అవకాశం ఉంది.