Marriage Baraat : డాన్స్ చేస్తూ బోర్లాపడ్డ వధూవరులు

పెళ్లి వేడుకలో బారాత్ తప్పనిసరైంది. గతంలో పెళ్లివేడుకకు వచ్చిన వారు బారత్‌లో డాన్స్ చేసేవారు. కానీ రాను రాను ట్రెండ్ మారుతుంది.

Marriage Baraat : డాన్స్ చేస్తూ బోర్లాపడ్డ వధూవరులు

Marriage Baraat

Updated On : October 24, 2021 / 9:01 AM IST

Marriage Baraat : పెళ్లి వేడుకలో బారాత్ తప్పనిసరైంది. గతంలో పెళ్లివేడుకకు వచ్చిన వారు బారత్‌లో డాన్స్ చేసేవారు. కానీ రాను రాను ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు వధూవరులు కూడా డాన్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన పెళ్లి వేడుకలో బులెట్ బండి పాటకు డాన్స్ చేసి ఫేమస్ అయిపోయారు నవవధువు. ఇక ఆ తర్వాత ఇటువంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చక్కర్లు కొట్టాయి.

చదవండి : Rajasthan Child marriage : బాల్య వివాహాల రిజిస్ట్రేషన్‌ చట్టంపై వెనక్కి తగ్గిన రాజస్థాన్‌ ప్రభుత్వం

అయితే ఇప్పుడు మనం చూస్తున వీడియోలో వధూవరులు పెళ్లి అనంతరం కుటుంబ సభ్యులు, బంధువుల చూస్తుండగా డాన్స్ చేయడం ప్రారంభించారు. సాల్సా స్టెప్ వేసేందుకు ప్రయత్నించారు. అయితే స్టెప్పు తప్పడంతో ఇద్దరు కిందపడిపోయారు. ఊహించని విధంగా జరగడంతో అతిథులంతా షాకయ్యారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది తెలియరాలేదు. అక్కడ ఉన్నవారు ఈ వీరి డాన్స్‌ను తమ కెమెరాల్లో బందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది.

చదవండి : Marriage : ఇదేం పెళ్లిరా బాబు.. కర్రలతో కొట్టుకున్న వధూవరులు.. వైరల్ వీడియో

 

View this post on Instagram

 

A post shared by ?? MARIE BLANCHARD?? (@haitianbeauty25)