NIA charge sheets : గుజరాత్ మీదుగా డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్..13మంది పాకిస్థానీలపై ఎన్ఐఏ చార్జిషీట్
గుజరాత్ రాష్ట్రం మీదుగా పాకిస్థానీలు డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ బాగోతంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తాజాగా కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణ కోసం పాకిస్థాన్ జాతీయులు నిధులు కూడా సమర్పించారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది....

NIA charge sheet
NIA charge sheets : గుజరాత్ రాష్ట్రం మీదుగా పాకిస్థానీలు డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ బాగోతంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తాజాగా కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణ కోసం పాకిస్థాన్ జాతీయులు నిధులు కూడా సమర్పించారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ కేసులో 13 మంది నిందితులు కాగా, అందులో పదిమందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది.
American singer Mary Millben : అమెరికా గాయని మేరీ మిల్‌బెన్ మోదీకి పాదాభివందనం
డ్రగ్స్, ఆయుధాలను పాకిస్థాన్ ఫిషింగ్ బోటులో గ్యాస్ సిలిండర్ల లోపల ఉంచి గుజరాత్ మీదుగా భారత్ రవాణా చేస్తుండగా ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు.(smuggling drugs, weapons via Gujarat) 40 కిలోల హెరాయిన్, ఆరు విదేశీ పిస్టళ్లు, ఆరు మేగజైన్స్, 120 లైవ్ 9 ఎంఎం కాట్రిడ్జిలు, పాకిస్థానీ గుర్తింపు కార్డులు, మొబైల్ ఫోన్లు, పాకిస్థానీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంది. దీనిపై ఎన్ఐఏ అహ్మదాబాద్ స్పెషల్ కోర్టు చార్జీ షీట్ దాఖలు చేసింది.
Mutiny in Russia: రష్యాలో కిరాయి సైన్యం తిరుగుబాటు..మాస్కోలో హైఅలర్ట్
పదిమందిని అరెస్టు చేయగా హాజీ సలీం, అక్బర్, కరీంబక్ష్ లు పరారీలో ఉన్నారు.(13 Pakistanis)పరారీలో ఉన్న ముగ్గురు పాకిస్థానీయుల కోసం ఎన్ఐఏ గాలింపు కొనసాగిస్తోంది. నౌకల ద్వారా అత్యంత అధునాతన వాహనాలను భారతదేశంలోకి అక్రమంగా దిగుమతి చేశారు. ఉత్తరభారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉగ్రవాదులకు ఆయుధాలను పాకిస్థానీలు అందించారని తేలింది.
US Intelligence Report : కొవిడ్ వ్యాప్తిపై యూఎస్ ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక
పాకిస్థాన్ దేశంలోని ఓఖా తీరం నుంచి డ్రగ్స్ ను అక్రమంగా తరలించారని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తులో వెల్లడైంది. గత ఏడాది డిసెంబరు 27వతేదీన పాకిస్థానీ ఫిషింగ్ బోటు అల్ సోహేలీలో డ్రగ్స్, ఆయుధాలను తరలిస్తుండగా ఏటీఎస్ పట్టుకుంది. కేంద్రం ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏకు అప్పగించగా ఎట్టకేలకు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జీ షీట్ వేసింది.