Diabetes pill : ట్యాబ్లెట్ల రూపంలో ఇన్సులిన్ .. మధుమేహ రోగులు ఇక ఇంజక్షన్లు పొడుచుకోనక్కర్లేదంటున్న శాస్త్రవేత్తలు

మధుమేహ రోగులు ఇక ఇంజక్షన్లు పొడుచుకోనక్కర్లేదంటున్నారు. శాస్త్రవేత్తలు. ఎందుకంటే ట్యాబ్లెట్ల రూపంలో ఇన్సులిన్ రాబోతోంది.

Diabetes pill : ట్యాబ్లెట్ల రూపంలో ఇన్సులిన్ .. మధుమేహ రోగులు ఇక ఇంజక్షన్లు పొడుచుకోనక్కర్లేదంటున్న శాస్త్రవేత్తలు

No insulin injection..only tablet

Updated On : December 15, 2022 / 3:11 PM IST

Diabetes pill : మధుమేహ రోగులకు పరిశోధకులు శుభవార్త చెప్పారు. ఇన్సులిన్ ఇంజెక్షలు తీసుకునే మధుమేహులు ఇకపై ఇంజక్షన్లతో పొడుచుకునే బాధ ఉండదని తెలిపారు. ఇక ఇంజెక్షన్లు పొడుచుకునే బాధనుంచి విముక్తి చేసేలా కృషి చేసిని పరిశోధకులు ఇకనుంచి ఓ మాత్ర వేసుకుంటే సరిపోతుందంటున్నారు. పరిశోధకుల కృషి ఫలితంగా ఇక ట్యాబ్లెట్ల రూపంలో ఇన్సులిన్ అందుబాటులోకి రానుంది. ఈ ట్యాబ్లెట్లు అందుబాటులోకి వస్తే ఇకపై రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్లు పొడుచుకునే బాధ తప్పుతుంది. అతి త్వరలోనే ట్యాబ్లెట్ల రూపంలో ఇన్సులిన్ అందుబాటులోకి రానుంది.

ఇన్సులిన్ ని ట్యాబ్లెట్ల రూపంలోకి తీసుకురావాలని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధన విజయవంతమైంది. ఇన్సులిన్‌ను మాత్రల రూపంలో తయారు చేయాలన్నది శాస్త్రవేత్తల వందేళ్ల కల. ఈ కలను మాలిక్యుల్‌ను మెల్‌బోర్న్‌లోని వాల్టర్‌ అండ్‌ ఎలిజా హాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ పరిశోధకులు డాక్టర్‌ నికొలస్‌ కిర్క్‌, ప్రొఫెసర్‌ మైక్‌ లారెన్స్‌ నెరవేర్చారు. దీనికి మార్గాన్ని డాక్టర్ కిర్క్, మైక్ లారెన్స్ కనుగొన్నారు. రక్తంలో చక్కెర స్థాయులను ఇన్సులిన్ నియంత్రిస్తుంది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ మాలిక్యుల్‌ను మెల్‌బోర్న్‌లోని వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధకులు డాక్టర్ నికోలస్ కిర్క్, ప్రొఫెసర్ మైక్ లారెన్స్ కనుగొన్నారు. రక్తంలో గ్లూకోజ్ తీసుకునే ప్రక్రియను ప్రేరేపించే మాలిక్యుల్‌ను ఈ పరిశోధనలో పరిశోధకులు గుర్తించారు.

ఇన్సులిన్ అనేది అస్థిరం(unstable’ కాబట్టి దానిని మాత్రల రూపంలో అందుబాటులోకి తీసుకురావటానికి శాస్త్రవేత్తలు ఎన్నోఏళ్లుగా కష్టపడుతున్నారు. వారి కృషి ఫలించింది.ఇప్పుడు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ (సైరో ఈఎం) సాంకేతికతతో ఇన్సులిన్‌ను ప్రేరేపించే ఒక పెప్టైడ్‌ను గుర్తించామని దీనిని ట్యాబ్లెట్ గా తీసుకురావటానికి మరికాస్త సమయం పడుతుందని డాక్టర్ నికోలస్ కిర్క్ తెలిపారు. దీనిపై ఇంకా పరిశోధన జరగాల్సి ఉందని వివరించారు.

రక్తంలో గ్లూకోజ్‌ తీసుకొనే ప్రక్రియను ప్రేరేపించే మాలిక్యుల్‌ను ఈ కొత్త పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధనల గురించి డాక్టర్‌ కిర్క్‌ ఇంకా మాట్లాడుతూ..ఇన్సులిన్‌ను మాత్ర రూపంలో తయారు చేయడానికి శాస్త్రవేత్తలు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇన్సులిన్‌ అస్థిరం. జీర్ణమైన తర్వాత శరీరంలో సులభంగా క్షీణిస్తుంది. అందుకే ఇన్సులిన్‌ను కనుగొని వందేళ్లయినా మాత్రను అభివృద్ధి చేయడం కలగానే మిగిలిపోయింది తప్ప పెద్దగా విజయం సాధించలేదని తెలిపారు. ఇప్పుడు సైరో ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపీ (సైరో ఈఎమ్‌) సాంకేతికతతో ఇన్సులిన్‌ను ప్రేరేపించే ఒక పెప్టైడ్‌ను గుర్తించామని..దీన్ని ఔషధంగా మార్చేందుకు మరికాస్త సమయంలో పడుతుందని మరిన్ని పరిశోధనలు జరగాలని తెలిపారు. ఇది టైప్‌-1 మధుమేహులకు మాత్రల ద్వారా చికిత్స చేయాలనుకుంటున్న పరిశోధకులకు ఉత్తేజమిచ్చే ఆవిష్కరణ అని డాక్టర్‌ కిర్క్‌ తెలిపారు.