NPR ఎఫెక్ట్.. డైలామాలో ఎన్ఆర్ఐలు!

  • Published By: sreehari ,Published On : January 4, 2020 / 03:08 PM IST
NPR ఎఫెక్ట్.. డైలామాలో ఎన్ఆర్ఐలు!

Updated On : January 4, 2020 / 3:08 PM IST

ఇండియాలో పౌరసత్వాన్ని పొందాలంటే కచ్చితంగా దేశంలోనివారంతా జాతీయ పౌరుల పట్టిక (NRC), జాతీయ జనాభా పట్టిక (NPR)లో నమోదు చేయించుకోవడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో నివసిస్తున్న పౌరులతో పాటు ఇతర దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు కూడా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి అవసరం ఉంది. తాము భారతీయులమని నిరూపించుకోవాలంటే తప్పనిసరిగా NPR, NRCలో వివరాలను నమోదు చేయించుకోవాలనేది కొత్త చట్టం చెబుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న ఎన్‌ఆర్ఐల్లో ఆందోళన నెలకొంది. గల్ఫ్, అమెరికాలోని ఓ వర్గానికి చెందిన NRIలను NPR డైలామాలో పడేసింది.

తమ భారతీయ పాస్ పోర్టుల్లో వ్యతాసాలు ఉండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అందుకే చాలామంది ఎన్ ఆర్ఐలు తమ ప్రాంతంలోని భారతీయ దౌత్యకార్యాలను సంప్రదించి తమ వివరాలను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. విదేశాల్లోని కొంతమంది భారతీయుల్లో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ నుంచి సౌదీ అరేబియా సహా ఇతర గల్ఫ్ దేశాలతో పాటు అమెరికాకు ఉపాధి కోసం వెళ్లి అక్కడే పనిచేస్తున్నారు. అయితే తమ పాస్ పోర్టుల్లో ఉన్న వ్యక్తిగత డేటాలో వ్యత్యాసాలు ఉండటంతో తమను తాము భారతీయులుగా నిరూపించుకోవడం కష్టతరంగా మారింది. NRC, NPR కోసం తమ కుటుంబ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది.

ఇండియాలో బయోమెట్రిక్ వ్యవస్థ లేని సమయంలో జీవనోపాధి కోసం అనేక విఫలయత్నాల అనంతరం ఈ భారతీయుల్లో ఎక్కువ మంది విదేశాలకు వచ్చారు. చాలా మంది తప్పుడు సమాచారంతో పాస్‌పోర్టులు పొందటానికి మధ్యవర్తుల సహాయంతో మోసపూరిత పద్ధతులతో విదేశాలకు వెళ్లిపోయారు.

ఈ కేటగిరికి చెందిన NRIలంతా అప్పుల బాధితులు లేదా ప్రతికూల పరిస్థితు ప్రభావంతో విదేశాల్లో జీవనోపాధి కోసం వెళ్లినవారే ఎక్కువ మంది ఉన్నారు. ‘నేను సౌదీలో అడుగుపెట్టినప్పుడు నాకు ఆహారం, జీతం ఇచ్చేందుకు నిరాకరించారు. నేను పారిపోయాను. మరో చోటకు వెళ్లి పనిచేశాను. అక్కడే వీసాను ఏర్పాటు చేసి భారత్‌కు తిరిగి వచ్చాను.

అప్పుడే నా పేరును మార్చుకుని 25ఏళ్ల క్రితమే తిరిగి సౌదీకి వెళ్లాను’ అని ప్రవాసీయుడు ఒకరు తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాన్ని అర్హత సాధించేందుకు చాలామంది ఆర్థికంగా వెనుకబడిన యువకులంతా తమ పుట్టినతేదీలను మార్చుకున్నారు. చాలామంది వీసా దరఖాస్తుదారులు అమెరికా వీసా కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.

అప్పటి మద్రాసులోని అమెరికా రాయబారి కార్యాలయంలో వీసా ఇంటర్వ్యూల్లో సైతం ఫెయిల్ అయ్యారు. చివరిగా కొంతమంది ఏజెంట్ల ద్వారా దొంగదారిలో విదేశాలకు వెళ్లిపోయారు. వీరిలో గుజరాత్ పౌరులే ఎక్కువ మంది ఉన్నారు. 2001 సెప్టెంబర్ నెలలో అమెరికాలో ట్విన్ టవర్ ఎటాక్ జరిగిన తర్వాత సౌదీ అరేబియా, అమెరికా సహా అనేక దేశాలు బయో మెట్రిక్ వ్యవస్థను అవలంభించి వీసా మోసపూరిత పద్ధతులను గుర్తించాయి.