Pakistan blast Pakistan blast : పాక్ పెషావర్‌లో పేలుడు…ఒకరి మృతి, 8 మందికి గాయాలు
పాకిస్థాన్ దేశంలో సోమవారం ఉగ్రవాదులు మరో సారి పేలుడుకు పాల్పడ్డారు. పాక్ దేశం ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌లో భద్రతా దళాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని సోమవారం జరిగిన పేలుడులో పారామిలటరీ సిబ్బంది ఒకరు మరణించగా,మరో 8 మంది గాయపడ్డారు....

Pakistan blast
Pakistan blast : పాకిస్థాన్ దేశంలో సోమవారం ఉగ్రవాదులు మరో సారి పేలుడుకు పాల్పడ్డారు. పాక్ దేశం ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌లో భద్రతా దళాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని సోమవారం జరిగిన పేలుడులో పారామిలటరీ సిబ్బంది ఒకరు మరణించగా,మరో 8 మంది గాయపడ్డారు. పెషావర్‌లో భద్రతా బలగాల వాహనం లక్ష్యంగా సోమవారం ఉగ్రవాదులు పేలుడుకు పాల్పడ్డారు.
Air Asia Flight : ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగివచ్చింది
ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ఫ్రాంటియర్ కాన్‌స్టాబులరీ (ఎఫ్‌సి) మహ్మండ్ రైఫిల్స్ రెజిమెంట్‌కు చెందిన వాహనంపై ఉగ్రవాదులు సోమవారం ఉదయం 10:30 గంటలకు దాడికి పాల్పడ్డారని వార్సాక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పి) మహ్మద్ అర్షద్ ఖాన్ తెలిపారు. (One dead, 8 injured after blast) పేలుడు జరిగిన సమయంలో వాహనం మచ్ని నుంచి పెషావర్ వైపు వెళుతోంది. ఈ దాడిలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) ఉపయోగించినట్లు ఎస్పీ తెలిపారు. (security forces rocks Pakistan) పేలుడు ప్రభావంతో వాహనం పూర్తిగా దెబ్బతిన్నట్లు దృశ్యాలు చూపుతున్నాయి.
Maharashtra : థానే హైరైజ్ భవనంలో కూలిన లిఫ్ట్…ఏడుగురి మృతి
ఘటనా స్థలంలో ఉన్న భద్రతా బలగాలు, ప్రజలు ఉన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మాలి ఖేల్ ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 9 మంది భద్రతా సిబ్బంది మరణించగా, మరో 17 మంది గాయపడిన కొద్ది రోజుల తర్వాత పెషావర్‌లో ఈ పేలుడు సంభవించింది. జులై 30వతేదీన ప్రావిన్స్‌లోని ఖార్‌లో జరిగిన రాజకీయ పార్టీ సమావేశంలో ఆత్మాహుతి బాంబర్ పేలుడుకు పాల్పడటంతో 54 మంది మరణించారు. ఈ ఆత్మాహుతి దాడిలో 100 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో కరడుగట్టిన ఇస్లామిస్ట్ పార్టీ అయిన జమియాత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఫజల్ కి చెందిన 400 మందికి పైగా సభ్యులు, వారి మద్దతుదారులు ఉన్నారు.