కరోనా నుంచి 3లక్షల 70వేల మంది కోలుకున్నారు.. ఎందుకో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అమెరికా, ఇటలీ దేశాల్లో వైరస్ బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తిన కరోనా వైరస్ బారినుంచి 3 లక్షల 72వేల మంది సురక్షితంగా బయటపడ్డారు. కరోనా మహమ్మారి నుంచి లక్షల మంది కోలుకోవడానికి అసలు కారణం.. వారిలోని ఇమ్యూనిటీ సిస్టమ్ (రోగనిరోధక వ్యవస్థ) ఒక్కటే. మీలో వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే మాత్రం ఎలాంటి వైరస్ అయినా నాశనం చేసేస్తుందని University-Purdue University Indianapolis లో epidemiology education Indiana డైరెక్టర్ Tom Duszynski ఇదే విషయాన్ని వెల్లడించారు.
కరోనా సోకిన వ్యక్తికి దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఇతర అనారోగ్య సమస్యలు లేకుంటే వారు తొందరగా కోలుకుంటారని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ ఎంతమంది వైరస్ నుంచి కోలుకున్నారనేది స్పష్టత లేదు. అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాలు వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి లేదా ఎంతకాలం వారిలో వ్యాధినిరోధక శక్తి ఉంటుంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారికి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకుందాం..
4 లక్షల వరకు కోలుకున్నట్టు అంచనా :
Johns Hopkins University డేటాబేస్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య గణాంకాల్లో 3 లక్షల 72వేల మంది ఉన్నట్టు చెబుతోంది. వాస్తవానికి దీనికంటే ఎక్కువ సంఖ్యలోనే కరోనా నుంచి బాధితులు కోలుకున్నట్టు అంచనా. ఒక్కో దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలను ట్రాక్ చేసిన జాన్స్ హాప్కిన్.. డేటాలో కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. చాలా దేశాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లోని బాధితులు ఎంతమంది కోలుకున్నారో కచ్చితంగా చెప్పలేమని, ఎలాంటి రిపోర్టు కూడా లేదన్నారు.
చైనా బయట దేశాల్లో ఆయా దేశీయ ప్రాంతీయ మీడియా నివేదికల ప్రకారం చూస్తే.. కోలుకున్నవారి సంఖ్య వాస్తవ సంఖ్య కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని యూనివర్శిటీ ప్రతినిధి Douglas Donovan ఒక ప్రకటనలో వెల్లడించారు. అమెరికా సహా చాలా దేశాల్లో పరిమిత సంఖ్యలోనే టెస్టింగ్ లభ్యత ఉండటంతో అత్యధికంగా తీవ్రమైన కేసులను మాత్రమే గుర్తించగలుతున్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారిని పరీక్షించే పరిస్థితి లేదు. ఒకవేళ వారంతంట వారే పరీక్షలు చేయించువరకు ఆయా కేసుల సంఖ్య తెలియని పరిస్థితి. ఇలా చాలావరకు స్వల్ప ఇన్ఫిక్షన్లతో ఉన్నవారంతా కోలుకున్నా కూడా అధికారిక మొత్తం గణాంకాల్లో చేరడం లేదు.
రికవరీ ఎలా ఉంటుందంటే? :
చాలా మంది రోగులకు తేలికపాటి దగ్గు ఉందని, కోలుకున్న తర్వాత కూడా అలసిపోయినట్లుగా కనిపిస్తారు. ఇకపై వారిలో అంటువ్యాధి లేదని Hota చెప్పారు. వీరంతా పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందని తెలిపారు. ఈ వ్యాధి నుండి కోలుకోవడానికి 6 వారాల సమయం పడుతుంది” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యవసర కార్యక్రమ కార్యనిర్వాహక డైరెక్టర్ Dr. Mike Ryan ఇటీవలే చెప్పారు.
చాలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు అనారోగ్యం నుండి కోలుకోవడానికి నెలలు పట్టవచ్చునని అన్నారు. వెంటిలేటర్ మీద ఉంచిన రోగుల విషయంలో ఈ ప్రక్రియ చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. వెంటిలేటర్ నుండి బయటికి వచ్చాక వారు తరచూ చాలా రోజులు ICUలో ఉంటారు. ఆపై తిరిగి కొన్ని రోజులు నుండి వారం వరకు లేదా వారి బలాన్ని తిరిగి పొందడానికి చాలా సమయం పడుతుంది.
శాశ్వత ప్రభావాలు :
చికాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయంలో పాథాలజీ ప్రొఫెసర్ Dr. Shu-Yuan Xiao మాట్లాడుతూ.., COVID-19 తేలికపాటి కేసులతో బాధపడుతున్న చాలా మంది ప్రజలు శాశ్వత ప్రభావం లేకుండా కోలుకోవాలని అన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు భవిష్యత్తులో తరచూ అనారోగ్యాలు పాలవుతునే ఉంటారని చెప్పారు. కోలుకున్న 12 మంది రోగుల బృందంలో.. ఇద్దరి నుంచి ముగ్గురు వైద్యులతో కలిసి పరిశీలించగా.. ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గినట్లు హాంకాంగ్ హాస్పిటల్ అథారిటీ నివేదించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఆ కొద్దిమంది రోగులు వారు నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోలేకపోతుంటారు. 9 మంది రోగులకు స్కాన్లలో ఊపిరితిత్తులు దెబ్బతినే సంకేతాలు వెల్లడయ్యాయి.
యాండీ బాడీస్, వ్యాధినిరోధకత :
కరోనా వైరస్ సోకిన వారిలో యాండీ బాడీస్ డెవలప్ అయితే.. శరీరంలోని వ్యాధినిరోధ వ్యవస్థ వైరస్ పై సమర్థవంతంగా పోరాడుతుంది. మరోసారి వారికి కరోనా వైరస్ సోకితే మాత్రం వెంటనే వ్యాధినిరోధక మరింత పటిష్టంగా మారుతుంది. అదే.. వారిలో వ్యాధినిరోధకతను పెంచుతుంది. కానీ, అది ఎంతవరకు రక్షణగా నిలుస్తుందో చెప్పలేమంటున్నారు.
మరోసారి వ్యాధి తిరగబడితే ఎంతమందిలో వ్యాధినిరోధక పోరాడుతుంది అనేది సవాల్ గా మారిందని National Institute of Allergy and Infectious Diseases డైరెక్టర్ Dr. Anthony Fauci ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవేళ ఒక వ్యక్తికి ఫిబ్రవరి, మార్చిలో వైరస్ సోకి కోలుకుంటే.. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వైరస్ సోకిన వ్యక్తిలో యాంటీ బాడీస్ కారణంగా వైరస్ నుంచి రక్షణ వ్యవస్థ అడ్డుకుంటుందని నమ్ముతున్నట్టు Fauci అభిప్రాయపడ్డారు. అందుకే చాలా కంపెనీలు వ్యాధినిరోధకత కలిగిన వారిలో బ్లడ్ టెస్టుల ద్వారా కొవిడ్-19 యాండీ బాండీస్ ను గుర్తించే పనిలోపడ్డాయి.
స్వీయ నిర్బంధం నుంచి ఎప్పుడు బయటకు రావొచ్చు :
ఒకవేళ మీరు అనారోగ్యంగా అనిపిస్తే.. మీరెప్పుడూ వైరస్ నుంచి కోలుకున్నారో తెలుసుకోవాలంటే.. CDC మార్గదర్శకాల ప్రకారం.. మీరు పరీక్షలు చేయించుకున్నారో లేదా అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు పరీక్ష చేయించుకోకుంటే.. ఈ మూడు ప్రమాణాలకు చేరుకునేంతవరకు ఐసోలేషన్ లో ఉండక తప్పదు. కనీసం 72 గంటల్లో మీకు ఎలాంటి జ్వరం (ఎలాంటి మందులు వాడకుండా) ఉండకూడదు.
మీలో ఇతర లక్షణాలు (శ్వాస తీసుకోలేకపోవడం లేదా దగ్గు) ఎక్కువగా ఉండటం.. కనీసం వారం రోజులుగా ఇలాంటి లక్షణాలు కనిపించిస్తున్నట్టు అయితే అప్పటివరకూ బయటకు రాకపోవడమే మంచిది. ఐసోలేషన్ వీడేముందు.. ఒకవేళ మీరు టెస్టింగ్ చేస్తే.. గత 24 గంటల్లో రెండు సార్లు నెగటివ్ అని తేలాలి. అప్పటివరకూ మీలో ఎలాంటి జ్వరం (ఎలాంటి మెడిసిన్ వాడకుండా) ఉండకూడదు. ఆ తర్వాత ఎలాంటి ఇతర లక్షణాలు పెరగకుండా ఉండాలి. ఈ నిర్దిష్ట ప్రమాణాలకు తగినట్టుగా ఉంటే.. మీరు ఐసోలేషన్ నుంచి బయటకు రావొచ్చు.
అది కూడా మీరు ప్రాంతాల్లోని నియమ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఎవరితోనూ కలవకూడదు.. మీరు తాకిన వస్తువులు, వస్త్రాలను శానిటైజ్ చేయడం తప్పక చేయాల్సి ఉంటుంది. ఒక వ్యక్తిలో వైరస్ సోకి కోలుకున్నాక అది వారి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా లేదా అనేది సైంటిస్టులు కూడా కచ్చితంగా నిర్ధారించలేకపోతున్నారు.
కానీ, జర్మనీకి చెందిన పరిశోధకులు మాత్రం కరోనా సోకిన బాధితుల్లో ఆరంభంలోనే వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పారు. కొన్ని స్వల్ప కేసుల్లో వైరస్.. ఐదు రోజుల తర్వాత క్రమంగా తగ్గుతూ పోతుంది. తేలికపాటి కేసులతో బాధపడుతున్న రోగులు మొదట లక్షణాలు కనిపించిన 8 రోజుల తరువాత అవి అంటువ్యాధులు కాదు. తీవ్రమైన కేసుల్లో 10 లేదా 11వ రోజు తర్వాత ఇతరులకు సంక్రమించలేదని జర్మనీ పరిశోధకులు చెబుతున్నారు.
Also Read | ఫరాఖాన్ 12ఏళ్ల కూతురి పెద్ద మనసు, వీధి జంతువుల ఆకలి తీర్చేందుకు చిత్రాలు అమ్మి రూ.70వేలు సేకరణ