India Pakistan War: భారత సైన్యం చర్యలతో వణికిపోతున్న పాక్.. రాజస్థాన్ సరిహద్దులో వైమానిక రక్షణ, ఫిరంగి దళాలు
పాకిస్థాన్ వైమానికదళం ప్రస్తుతం మూడు సైనిక విన్యాసాలను ఒకేసారి నిర్వహిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Fighter jet
India Pakistan War: పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ – పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రదాడితో ఆగ్రహంతో ఉన్న భారత ప్రభుత్వం.. ఎప్పుడైనా దాడిచేయొచ్చునని పాకిస్థాన్ వణికిపోతోంది. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా తన సరిహద్దుల్లో భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు వైమానిక రక్షణ, ఫిరంగి దళం వ్యవస్థలను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
Also Read: Amit Shah: మోదీ సర్కార్ ఎవరినీ వదలదు, వెంటాడి వెంటాడి అంతం చేస్తుంది- అమిత్ షా
పాకిస్థాన్ వైమానికదళం ప్రస్తుతం మూడు సైనిక విన్యాసాలను ఒకేసారి నిర్వహిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎఫ్-16, జే-10, జేఎఫ్-17సహా తదితర యుద్ధ విమానాలను వీటిలో కొనసాగిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు పాకిస్థాన్ సైన్యం వైమానిక స్థావరాల భద్రత సహా క్షేత్ర స్థాయి ఆస్తుల రక్షణ కోసం విమానాశ్రయ సెక్యూరిటీ ఫోర్స్ ను సరిహద్దుల్లో మోహరించింది. మరోవైపు చైనాకు చెందిన ఎస్ హెచ్-15 శతఘ్నలను పాకిస్థాన్ ఆర్మీ సమకూర్చుకోగా.. వాటిని ప్రస్తుతం సరిహద్దుకు తరలిస్తున్నట్లు సమాచారం.
రెండు రోజుల క్రితం పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అత్తౌల్లా తరార్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం ప్రకారం భారతదేశం రాబోయే 24 నుంచి 36గంటల్లో సైనికదాడి చేయొచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సరిహద్దుల్లో పాకిస్థాన్ దళాల కదిలికలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.