India Pakistan Tensions: భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. అమెరికా రక్షణ కార్యదర్శితో రాజ్‌నాథ్ సింగ్ కీలక చర్చలు
ఉగ్రవాదానికి మద్దతిస్తుందనే చరిత్ర పాక్ కు ఉందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు రాజ్ నాథ్ సింగ్.

Rajnath Singh
India Pakistan Tensions: పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోర్డర్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్ సెత్ తో ఫోన్ లో మాట్లాడారు. కీలక చర్చలు జరిపారు. పహల్గాం ఉగ్రదాడిపై చర్చించినట్లు సమాచారం. పాకిస్తాన్ దుశ్చర్యలను రాజ్ నాథ్ సింగ్ ఎండగట్టినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదానికి మద్దతిస్తుందనే చరిత్ర పాక్ కు ఉందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు రాజ్ నాథ్ సింగ్.
జమ్ము కశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడిలో అమాయక పౌరుల మరణం పట్ల అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తన ప్రగాఢ సానుభూతి తెలిపారు” అని రాజ్‌నాథ్ సింగ్ కార్యాలయం ఎక్స్ లో తెలిపింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే చర్యలకు తాము అండగా ఉంటామని అమెరికా స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై పోరాటాన్ని, తనను తాను రక్షించుకునేందుకు భారత్ తీసుకునే చర్యలను సమర్థిస్తున్నట్లు అమెరికా తెలిపింది. భారత్ కు అమెరికా మద్దతుగా నిలబడుతుందని ఆ దేశ రక్షణ కార్యదర్శి స్పష్టం చేసిన సంగతిని రాజ్ నాథ్ సింగ్ ఎక్స్ లో వెల్లడించారు.
ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఆజ్యం పోస్తోందని హెగ్సేత్‌తో రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఇకపై ఉగ్రవాదంపై ప్రపంచం గుడ్డిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెగ్సే కు స్పష్టం చేశారు రాజ్ నాథ్.
Also Read: భయంతో వణికిపోతున్న పాక్.. హఫీజ్ సయీద్‌ను రక్షించడానికి ఏం చేస్తోందంటే?
అమెరికా భారత్ కు సంఘీభావంగా నిలుస్తుందని, తనను తాను రక్షించుకునే భారత్ హక్కుకు మద్దతిస్తుందని హెగ్సేత్ అన్నట్లు సింగ్ కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. “ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అమెరికా ప్రభుత్వం నుంచి బలమైన మద్దతు ఉంటుందని హెగ్సేత్ పునరుద్ఘాటించారని” పోస్ట్ లో పేర్కొన్నారు.
అటు ఎల్‌ఓసీతోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఎల్‌వోసీ దగ్గర పాక్ కాల్పులు జరిపింది. కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్‌లో పాక్ కాల్పులను భారత సెన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఎల్‌ఓసీ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.