బోర్డర్ దాటిన భారతీయ బాలుడిని వెనక్కి పంపిన పాక్

బోర్డర్ దాటిన భారతీయ బాలుడిని వెనక్కి పంపిన పాక్

పొరపాటున దేశ సరిహద్దు దాటి పాక్ లోకి ప్రవేశించిన 16 ఏళ్ల భారతీయ బాలుడిని పాక్ భారత్ కి తిరిగి పంపించింది. పాక్ రేంజర్లు మర్యాదపూర్వకంగా బాలుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి అప్పగించారు.

అస్సాంకి చెందిన బిమల్ నర్జీ(16) 2018 ఆగస్టులో  పొరపాటున బోర్డర్ దాటి పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించాడు. వెంటనే పాక్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయపరమైన విచారణ, డాక్యుమెంట్ల పరిశీలన తర్వాత మంగళవారం(ఫిబ్రవరి-12,2019) పాక్ రేంజర్లు మర్యాదపూర్వకంగా బిమల్ ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి అప్పగించారు.2018 డిసెంబర్ 26న అత్తారీ-వాఘా బోర్డర్ ద్వారా అక్రమంగా
 భారత భూభాగంలోకి ప్రవేశించి అరెస్ట్ అయిన ఇద్దరు పాకిస్తానీలు మొహమద్ ఇమ్రాన్ ఖురేషి వార్సీ, అబ్దుల్లాలను భారత్ విడుదల చేసింది.