ICC Cricket World Cup 2023 : వరల్డ్ కప్ నేపథ్యంలో పాక్ క్రీడాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 విషయంలో పాకిస్థాన్ క్రీడాశాఖ మంత్రి ఎహ్సాన్ మజారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు పాక్ ప్రధాని కమిటీని ఏర్పాటు చేశారు. ఆసియా కప్ ఆడటానికి తమ పాకిస్థాన్ జట్టు సరిహద్దు దాటి భారతదేశానికి రాదని మంత్రి ఎహ్సాన్ మజారీ చెప్పారు....

Pakistan Sports Minister
Pakistan Will Withdraw From ICC Cricket World Cup 2023 : ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 విషయంలో పాకిస్థాన్ క్రీడాశాఖ మంత్రి ఎహ్సాన్ మజారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు పాక్ ప్రధాని కమిటీని ఏర్పాటు చేశారు. ఆసియా కప్ ఆడటానికి తమ పాకిస్థాన్ జట్టు సరిహద్దు దాటి భారతదేశానికి రాదని మంత్రి ఎహ్సాన్ మజారీ చెప్పారు. టోర్నమెంట్ ఆడేందుకు పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్ లో ఆసియా కప్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నజామ్ సేథీ అంగీకరించారు.
Plane Crash : కాలిఫోర్నియాలో కూలిన విమానం..ఆరుగురి మృతి
అక్టోబర్ 15వతేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు తలపడనున్నాయి. ప్రపంచ కప్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఇందులో పాకిస్థాన్ భారతదేశంలోని 5 వేదికల్లో ఆడనుంది. అయితే అక్టోబర్ 5వతేదీ నుంచి భారత్‌లో జరిగే ఓడీఐ ప్రపంచకప్‌లో బాబర్ ఆజం అండ్ కో పాల్గొనడంపై చర్చించడానికి పాక్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసినందున పాకిస్థాన్ ప్రపంచ కప్ నుంచి వైదొలిగే అవకాశం ఇప్పటికీ ఉంది. (Pakistan Sports Minister Sends Stern Warning To BCCI) భారత్ తమ ఆసియా కప్ మ్యాచ్‌లను తటస్థ వేదికపై ఆడితే, అదే పాకిస్థాన్‌కు వర్తింపజేయాలని పాక్ క్రీడా మంత్రి అంటున్నారు.
Honey Trapped : బీఎస్ఎఫ్ ఉద్యోగిపై పాక్ మహిళా ఏజెంట్ వలపు వల
‘‘ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నా మంత్రిత్వ శాఖ క్రిందకు వస్తుంది, ఒకవేళ భారతదేశం తమ ఆసియా కప్ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఆడాలని డిమాండ్ చేస్తే, మేం భారతదేశంలో జరిగే ప్రపంచ కప్ మ్యాచ్‌లకు కూడా అదే డిమాండ్ చేస్తాం’’ అని మంత్రి మజారీ చెప్పారు. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పాల్గొంటుందో లేదో అంచనా వేయడానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వం వహిస్తారు.
Vande Bharats New Colour : వందేభారత్ రైళ్లకు ఇక కాషాయరంగు
‘‘ఈ కమిటీలోని 11 మంది మంత్రుల్లో నేను కూడా ఉన్నాను. మేము సమస్యను చర్చిస్తాం, పీసీబీ చీఫ్ అయిన ప్రధానమంత్రికి మా సిఫార్సులను అందిస్తాం. ప్రధానమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారు’’ అని మజారీ అన్నారు. భారతదేశం క్రీడలను రాజకీయాల్లోకి తీసుకువస్తోందని పాక్ మంత్రి ఆరోపించారు. ఇతర క్రీడా సంబంధాలు ఇప్పటికే సజావుగా సాగుతున్నప్పుడు భారత ప్రభుత్వం తమ పురుషుల క్రికెట్ జట్టును పాకిస్థాన్ పంపకపోవడానికి సరైన కారణం కనిపించడం లేదని మజారీ చెప్పారు.