Pakistani Bride : ఎల్‌ఈడీ లైట్లతో అలంకరించిన లెహంగాను ధరించిన వధువు.. వీడియో వైరల్.. నెటిజన్లు అదిరిపోయే రియాక్షన్

పాకిస్థాన్‌లో వధువు తన భర్తతోకలిసి కలర్ ఫుల్ ఎల్‌ఈడీ లైట్లతో లెహంగా ధరించి ఎంట్రీ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pakistani Bride : ఎల్‌ఈడీ లైట్లతో అలంకరించిన లెహంగాను ధరించిన వధువు.. వీడియో వైరల్.. నెటిజన్లు అదిరిపోయే రియాక్షన్

Pakistani Groom

Updated On : September 7, 2023 / 1:26 PM IST

Pakistani Bride Lehenga With LED Lights: ఇటీవలి కాలంలో పెండ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వధువు, వరుడు వెరైటీ గెటప్స్‌తో పాటు, ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మరోవైపు పెళ్లి వేడుక, మెహిందీ వేడుక అంటే వధువు డ్రస్సుపైనే అందరి చూపు ఉంటుంది. ప్రత్యేకంగా డిజైన్ చేయించి అందరినీ ఆకర్షించేలా వధువు డ్రస్సు తయారు చేయిస్తుంటారు. తాజాగా పాకిస్థానీకి చెందిన వధువు మెహందీ వేడుకలో ప్రత్యేకమైన డ్రస్సును ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వధువుకు కాబోయే భర్తే స్వయంగా డ్రస్సును డిజైన్ చేయడంతో ఆ వధువు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వరుడు డిజైన్ చేసిన డ్రస్సుతో మొహందీ వేడుకలో వధువు తెగ సందడి చేసింది.

Viral Video : బిచ్చగాడి పట్ల ఓ చిన్నారి దయాగుణం.. అతని కోసం ఏం చేసిందంటే?

పాకిస్థాన్‌లో వధువు తన భర్తతోకలిసి కలర్ ఫుల్ ఎల్‌ఈడీ లైట్లతో లెహంగా ధరించి ఎంట్రీ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెహాబ్ తన మొహందీ వేడుకకు తన భర్తతో కలిసి మెరిసే లైట్లతో అలంకరించిన దస్తులను ధరించింది. వరుడే స్వయంగా ఈ డ్రస్సును డిజైన్ చేయడం గమనార్హం. లెహంగాకు చిన్నచిన్న ఎల్‌ఈడీ లైట్లు అమర్చాడు. దీంతో వధువు, వరుడు స్టేజీపైకి వచ్చిన సమయంలో వధువు డ్రస్సు చుట్టూ ఎల్ ఈడీ లైట్లు వెలుగుతూ కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: గర్భంతో ఉన్న నల్లజాతీయురాలిని కాల్చి చంపిన పోలీసు.. ఎందుకంటే?

వధువు లెహంగాకు ఎల్‌ఈడీ లైట్లు అమర్చిన వధువు ఆలోచనను సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. వరుడు ఆలోచన బాగుంది అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. వధువు భర్త ఎలక్ట్రీషియన్ అయ్యిఉండొచ్చు అంటూ మరో నెటిజన్ రాశాడు. వరుడు ఐడియా బాగుంది.. వధువు ఫిదా అయింది అంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు. పలువురు నెటిజన్లు తమతమ అభిప్రాయాలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. భర్త డిజైన్ చేసిన వీడియోపై వధువు సంతోషం వ్యక్తం చేసింది. నేను గర్వంగా ఫీలవుతున్నాను. ఎందుకంటే పెళ్లికూతురు కోసం ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదని నాకు తెలుసు. నేను చాలా ఆనందంగా ఉన్నాను అంటూ వధువు పేర్కొంది.

 

 

View this post on Instagram

 

A post shared by Rehab Danial (@rehabmaqsood)