Pakistan: పాకిస్థాన్‌లో మరో సంక్షోభం.. ఇక తట్టుకునేదెలా?

ఇప్పటికే పాక్ లో ఆహార సంక్షోభంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఆ సమస్య మరింత...

Pakistan: పాకిస్థాన్‌లో మరో సంక్షోభం.. ఇక తట్టుకునేదెలా?

Pakistans agriculture sector

Updated On : July 29, 2023 / 10:53 AM IST

Pakistan – Crisis : పాకిస్థాన్‌ మరో సంక్షోభం అంచున నిలిచింది. ఇప్పటికే పాకిస్థాన్ రాజకీయ, ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. యూరియా కొరతతో పాకిస్థాన్ వ్యవసాయ రంగం (Agriculture sector) సంక్షోభంలో పడే ముప్పు ఉందని ఎరువుల సమీక్ష కమిటీ (FRC) ఓ నివేదికలో పేర్కొంది. డిమాండుకు తగ్గ ఎరువులు అందుబాటులో లేవని తెలిపింది.

ఇప్పటికే పాక్‌ను సహజ వాయువు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌తో పాటు వచ్చే రబీ సీజన్‌లో పాకిస్థాన్ యూరియా కొరతను ఎదుర్కోనుందని ఎఫ్ఆర్సీ తెలిపింది. ఎరువుల పరిశ్రమకు సహజ వాయువు సరఫరా తగినంత లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతోందని వివరించింది.

ఉండగా, ఇఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయంలో 50 కిలోల యూరియా ధర రూ.2,600గాప్పుడు అది రూ.3,000కు పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో అంతకంటే అధికంగా ఉంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాక్ లో ఆహార సంక్షోభంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

ఇక వ్యవసాయ సంక్షోభం నెలకొంటే ఆహార సంక్షోభం మరింత తీవ్ర తరం అయ్యే ముప్పు ఉంది. ఇప్పటికే పలు దేశాల నుంచి పాక్ కు అప్పులు కూడా దక్కడం లేదు. ఇక ప్రజలు ఆకలికి తట్టుకునేదెలానో తెలియని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది.

Manipur Violence: మణిపూర్ హింస వెనుక విదేశీ శక్తులు .. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కీలక వ్యాఖ్యలు