భారత్ కు మద్దతుగా పాక్ జర్నలిస్టులు:అభినందన్ అప్పగించాలని డిమాండ్

పాకిస్తాన్ : పాక్ జర్నలిస్టులు భారతదేశానికి మద్ధతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వారు లాహోర్ ప్రెస్ క్లబ్ దగ్గర పాకిస్థాన్ జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. భారత్ కమాండ్ అభినందన్ ను భారత్ కు క్షేమంగా అప్పగించాలని డిమాండ్ చేస్తు..జర్నలిస్టులు శాంతి ర్యాలీ చేపట్టారు. తాము యుద్ధాన్ని కోరుకోవటం లేదంటు..ప్లకార్డులను ప్రకటిస్తు ర్యాలీలో నినాదాలు చేస్తున్నారు.
భారత్ విండ్ కమాండర్ అభినందన్ ను మధ్యాహ్నం విడుదల చేస్తామని..పాక్ విదేశఆంగ శాఖ మంత్రి ఖురేషి ప్రకటించారు. ఈ క్రమంలో అభినందన్ విడుదల విషయంలో కొత్త ట్విట్ ఏర్పడింది. అభినందన్ ను ఎలా విడుదల చేస్తారంటు..ఓ సామాజిక కార్యకర్త కోర్టులో పిటీషన్ వేయటంతో అభినందన్ విడుదలపై సందిగ్థత ఏర్పడింది. మరి అభినందన్ విడుదలై క్షేమంగా తిరిగి వస్తాడని ఆశతో ఎదురు చూస్తున్న…అభినందన్ కుటుంబ సభ్యులతో సహా యావత్ భారత్ దేశం ఎదురు చూస్తున్న క్రమంలో ఈ సందిగ్థత దేనికి దారి తీస్తుందో వేచి చూడాలి. కాగా.. మిగ్-21 విమానం కూలిపోవడంతో ప్యారాచూట్ ద్వారా తప్పించుకునే యత్నం చేసిన అభినందన్, పాక్ ఆర్మీకి పట్టుబడిన విషయం తెలిసిందే.