Dinosaur Embryo in Egg : ఆ గుడ్డులో పళ్లులేని డైనోసర్.. శిలాజంలో ఎదిగిన పిండం.. ఎక్కడో తెలుసా?

అది కోడిగుడ్డు కాదు.. అసలు ఇప్పటి మోడ్రాన్ గుడ్డు అయితే అసలే కాదు.. అదో ఒకప్పటి డైనోసర్ గుడ్డు.. ఇప్పుడు చైనాలో బయటపడింది.. ఆ గుడ్డులో డైనోసర్ పిండం కూడా ఉంది.

Dinosaur Embryo in Egg : ఆ గుడ్డులో పళ్లులేని డైనోసర్.. శిలాజంలో ఎదిగిన పిండం.. ఎక్కడో తెలుసా?

Perfectly Preserved, ‘extremely Rare’ Dinosaur Embryo In Egg Found In China

Updated On : December 23, 2021 / 10:27 AM IST

Dinosaur Embryo in Egg : అది కోడిగుడ్డు కాదు.. అసలు ఇప్పటి మోడ్రాన్ గుడ్డు అయితే అసలే కాదు.. అదో ఒకప్పటి డైనోసర్ గుడ్డు.. ఇప్పుడు చైనాలో బయటపడింది..  చాలా అరుదైన ఆ గుడ్డులో డైనోసర్ పిండం కూడా ఉంది. ఏడు కోట్ల ఏళ్ల నాటి డైనోసర్ గుడ్డుగా గాంఝూ పరిశోధకులు గుర్తించారు. చైనాలోని గాంఝూ నగరంలో డైనోసర్ శిలాజ గుడ్డును గుర్తించినట్టు చెబుతున్నారు. ఈ శిలాజ గుడ్డు (అండం)లో పూర్తిగా ఎదిగిన పిండం ఉందని అంటున్నారు. ఎంతో ముద్దుగా కనిపించే ఈ శిలాజ అండానికి ‘బేబీ ఇంగిలియాంగ్‌’ (Baby Yingliang) అని పేరుపెట్టారు పరిశోధకులు. సౌతరన్ చైనాలోని గాంఝూ (Ganzhou) నగరంలో Jiangxi Province పళ్లు లేని డైనోసర్ గుడ్డును కనుగొన్నామని బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ పురాతత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒవిరాప్టోరోసారస్‌కు చెందిన 66 మిలియన్ల నాటి డైనోసర్ గుడ్డుగా చైనా పరిశోధకులు చెబుతున్నారు. రీసెర్చర్ Fion Waisum Ma ప్రకారం.. చరిత్రలో ఇప్పటివరకూ లభించిన డైనోసర్ గుడ్లలో ఇదే అత్యుత్తమ డైనోసర్ పిండమని అన్నారు.

వాస్తవానికి ఈ డైనోసర్ గుడ్డును 20ఏళ్ల క్రితమే చైనీస్ (Yinagliang Group) మైనింగ్ గ్రూపు గుర్తించినట్టు రీసెర్చర్లు వెల్లడించారు. కానీ, ఈ శిలాజ పిండాన్ని ఇతర శిలాజాలతో కలిపి 10ఏళ్లుగా నిల్వ చేసినట్టు తెలిపారు. ఇప్పుడు మైనింగ్ గ్రూపుకు సంబంధించిన కంపెనీ నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని నిర్మించే సమయంలో ఈ డైనోసర్ల శిలాజ పిండాన్ని కనుగొన్నట్టు చెప్పారు. డైనోసర్ల గుడ్లను మ్యూజియం సిబ్బంది సేకరించి లోతుగా అధ్యయానం చేసేందుకు స్టోర్ చేసినట్టు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో డైనోసర్ గుడ్లలో ఒకదానిలో పిండంలో కొన్ని ఎముకలు విరిగినట్టుగా పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా ఈ రకం డైనోసర్లకు శరీరంపై ఈకలుండేవి.. రకరకాల ముక్కులు ఉండేవని గుర్తించారు. గతంలో శిలాజాలు ఆసియా, ఉత్తర అమెరికాల్లో లభ్యమయ్యాయి. ఇలా పూర్తిగా ఎదిగిన పిండంగా ఉన్న డైనోసార్‌ గుడ్లు చాలా అరుదుగా లభించినట్టు పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం లభించిన గుడ్డులో పిండం.. ప్రస్తుత పక్షుల గుడ్లు, వాటి పిండాలను పోలి ఉన్నట్టు గుర్తించారు.

Perfectly Preserved, ‘extremely Rare’ Dinosaur Embryo In Egg Found In China (1)

‘బేబీ ఇంగ్‌లియాంగ్‌’ పొదగడం పూర్తయ్యే దశలో శిలాజంగా మారి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే డైనోసర్ పిండం.. తల శరీరం కిందకు ముడుచుకొని ఉన్నట్టు చైనా సైంటిస్టులు చెబుతున్నారు. పక్షుల గుడ్లలో పిండాలు పొదిగే క్రమం పూర్తయ్యే దశలో ఇదే యాంగిల్‌లో పిండాలు ఉంటాయని, ఇలా దశను టకింగ్‌ అని పిలుస్తారు. 27 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఈ బేబీ డినో.. (Yinglliang Stone Natural History Museum) మ్యూజియంలో ప్రస్తుతం ప్రదర్శనకు ఉంచారు. పక్షి పిండానికి రెక్కలుంటాయి.. ఈ డైనోసార్‌ పిండానికి పంజాలతో చిన్నపాటి చేతులున్నట్టు గుర్తించారు. ఈ డైనోసార్‌ శిలాజ అండంలో పిండం పొజిషన్‌ పరిశీలిస్తే.. ఇలాంటిది తొలుత డైనోసార్లలో ఉండేదని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. డైనోసర్ల నుంచి కాలక్రమేణా పక్షుల్లోకి ఇలా మారి ఉండొచ్చునని భావిస్తున్నారు. డైనోసార్ల పెరుగుదల, పునరుత్పత్తి, పక్షులతో మధ్య సంబంధంపై అధ్యయనం చేసేందుకు ఈ శిలాజ పిండం ఉపయోగపడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.

Read Also : Best Smart Phones in India 2021 : డిసెంబర్ 2021లో రూ.25వేల లోపు బెస్ట్ మొబైల్ ఫోన్లు ఇవే..!