రూ.500కే PPEలు అందిస్తున్న హైదరాబాద్ టెక్కీలు

రూ.500కే PPEలు అందిస్తున్న హైదరాబాద్ టెక్కీలు

Updated On : April 7, 2020 / 2:07 PM IST

కొవిడ్-19పై పోరాడేందుకు హైదరాబాద్ టెక్కీలు తమ వంతు సాయం అందిస్తున్నారు. జపనీస్ టెక్నాలజీ ఉపయోగించి రూ.500కే కిట్లను అందజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తమ్ ఘ్రాంధీ (32) అనే వ్యక్తి తనకున్న ఇష్టాన్ని ఈ రకంగా తీర్చుకుంటానని ఎప్పుడూ అనుకోలేదంటున్నాడు. డెకరేటివ్ షేప్స్, ఫిగర్లను పేపర్ ఫోల్డింగ్ ద్వారా తయారుచేసే హాబీని ఇలా మార్చుకున్నాడు. 

కరోనా వైరస్ పై పోరాడేందుకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ ను సిద్ధం చేయాలనేదే వారి ఆలోచన. ఆరోగ్య భద్రత పాటించాలని ఉన్నా.. పరికరాలకు అయ్యే ఖర్చుకు భయపడి చాలా మంది మాస్కులతో సరిపెట్టుకుంటున్నారు. వారందరికీ అందుబాటులో కళ్లు, తల, చేతులు, కాళ్లు, చెవులు అంతా కవర్ అయ్యేలా స్పెషల్ కిట్ రెడీ చేశామంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పీపీఈలు కొరత కనపడుతున్న తరుణంలో దీనికి సమాధానం వెదకడం తప్పనిసరిగా మారింది. డాక్టర్లతో పాటు ప్రముఖులకు డిజైన్లను పంపాం. వారందరి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. భారత్/అమెరికాల్లో స్థానికంగానే వీటిని తయారుచేయగలం. టెస్టింగ్ కోసం డాక్టర్లకు కిట్లను పంపాం. ఇవి ధరించడానికి అరగంట సమయం కూడా పట్టదు. కిట్ మొత్తం రూ.500కే వస్తుంది. (మాస్క్ రూ.120, ఫేస్ షీల్డ్ రూ.70, రెయిన్ సూట్ రూ.300)లిపి ఇస్తున్నాం. వీటిలో ఎక్కువ ధర రెయిన్ సూట్ కు మాత్రమే అవుతుందని ఉత్తమ్ అంటున్నాడు. 

టెస్టింగ్ పూర్తయింది. పలు డిజైన్లలో పీపీఈ కిట్లను లక్ష తయారుచేయాలనుకుంటున్నాం. అమెరికా, ఇండియా హాస్పిటళ్ల నుంచి మాకు ఆర్డర్లు కూడా వస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసి హాస్పిటళ్లకు అందజేస్తాం. ప్రపంచంలోనే తమకు ప్రత్యేక గుర్తింపురావాలని ఉత్తమ్ ఘ్రాంధీ టీం కోరుకుంటోంది.