రియల్ బర్డ్ : పక్షి రెక్కలతో పైకి ఎగిరే Drone వచ్చేసింది!

  • Published By: sreehari ,Published On : January 22, 2020 / 10:03 AM IST
రియల్ బర్డ్ : పక్షి రెక్కలతో పైకి ఎగిరే Drone వచ్చేసింది!

Updated On : January 22, 2020 / 10:03 AM IST

టెక్నాలజీ కొత్త పొంతలు తొక్కుతోంది. రోజురోజుకీ అధునాతన టెక్నాలజీతో ఎన్నో మార్పులు వచ్చాయి. పక్షుల్లా గాల్లోకి విమానాలు, రాకెట్లు ఎగురుతున్నాయి. అలాగే టెక్నాలజీ మరింత డెవలప్ కావడంతో అడ్వాన్స్ టెక్నాలజీతో డ్రోన్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పుడు చాలా విషయాలకు డ్రోన్లనే వినియోగిస్తున్నారు.

సాధారణంగా డ్రోన్లు కూడా పక్షుల్లా ఎగురుతాయని తెలుసు.. కానీ, ఈ డ్రోన్ చూస్తే.. నిజంగానే పక్షి ఎగురుతున్న ఫీల్ కలుగుతుంది. అన్ని డ్రోన్ల మాదిరిగా కాకుండా సరికొత్త డిజైన్ తో రూపొందించారు. అదే.. పక్షి రెక్కల డ్రోన్.. దీనికి PigeonBot అని పేరు కూడా పెట్టారు. అసాధారణ బయోమెట్రిక్ క్రియేషన్ ద్వారా స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలోని పరిశోధకులు ఈ డ్రోన్ తయారు చేశారు.

పక్షి మాదిరిగా ఎగిరేందుకు వీలుగా బయోహైబ్రిడ్ మోర్పింగ్ వింగ్స్ జతను వినియోగించారు.వీటిని చూడటానికి అచ్చం పక్షి రెక్కల మాదిరిగానే కనిపిస్తుంది. ఇప్పటివరకూ ఆకాశంలో ఎగిరిన డ్రోన్ల కంటే భిన్నంగా పక్షి రెక్కలతో కూడిన డ్రోన్ ఎలా ఉంటుందనే ప్రయోగాన్ని పరిశోధకులు టెస్టింగ్ చేసి విజయవంతమయ్యారు. దీనిపై స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ బయో ఇన్స్ ఫైర్డ్ రీసెర్చ్ అండ్ డిజైన్ (BIRD) ల్యాబ్ అధినేత డేవిడ్ లెంటింక్ మాట్లాుడుతూ.. నా వ్యక్తిగత లక్ష్యం.. పక్షుల్లా గగనంలో ఎగిరే రోబోట్స్ డెవలప్ చేయడమే.. ఒక పక్షి విమానం మోడల్ పై కూడా అధ్యయనం చేస్తున్నాను’ అని తెలిపారు.

రెక్కల నిర్మాణం వాటి ఆకృతి పక్షులు తేలిగ్గా గాల్లోకి ఎగరడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ, తమ రెక్కలను పక్షులు ఎలా కంట్రోల్ చేస్తున్నాయనేది ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై కొందరు నిపుణులు.. పక్షి తన ప్రతి రెక్కను ఒక్కొక్క కండరాల ద్వారా కంట్రోల్ చేస్తుందని అంటున్నారు. పక్షుల అస్థిపంజారం కదిలే విధానంపై పీహెచ్ డి విద్యార్థి అమాండా స్టోవర్స్ విశ్లేషించడం ప్రారంభించినట్టు లెంటిక్ తెలిపారు.

అదే రోబో కదికల్లో ప్రాథమికంగా 20 ఈకలు, మరో 20 విమాన రెక్కల మాదిరిగా ఉండేలా చూశారు. మరో విద్యార్థి లారా మాట్లోఫ్.. ఈ బర్డ్ రోబో ఎలా కదులుతుంది అనేదానిపై పరీక్షించగా అది పక్షి అస్థిపంజరంలా కదులుతోందని గుర్తించినట్టు తెలిపారు.

ఒక రోబోను డెవలప్ చేశాక (PigeonBot) తక్కువ బరువైన రోబోను 40 నిజమైన పావురం ఈకలతో రూపొందించారు. దీన్ని ఎక్కడికైనా ఈజీగా మోసుకెళ్లొచ్చు. ఇదో పక్షి విమానంగా చెప్పవచ్చు. దీని ముందుభాగంలో ఉండే ఫ్యాన్, పైకి ఎగిరేందుకు వీలుగా అమర్చారు. గాల్లో ఈ డ్రోన్ ఎగురుతుంటే అచ్చం పక్షి మాదిరిగానే కనిపిస్తోంది.. పక్షి డ్రోన్ ఎలా ఉందో ఈ వీడియోలో మీరు చూడండి..