Imran khan: దేశ ప్రతిష్ఠను పణంగా పెట్టి..డబ్బు కోసమే అమెరికాతో చేతులు కలిపాం: ఇమ్రాన్‌ ఖాన్

దేశ ప్రతిష్ఠను పణ్ణంగా పెట్టి.. కేవలం డబ్డు కోసమే అమెరికాతో చేతులు కలిపామని..పాక్ ప్రధాని ఇమ్రాన్ విచారం వ్యక్తంచేశారు.

Imran khan: దేశ ప్రతిష్ఠను పణంగా పెట్టి..డబ్బు కోసమే అమెరికాతో చేతులు కలిపాం: ఇమ్రాన్‌ ఖాన్

Pakistan Joined Us 'war On Terror' For Money

Updated On : December 22, 2021 / 12:59 PM IST

Pakistan joined US ‘war on terror’ for money: Imran Khan : అఫ్ఘానిస్తాన్‌లోని ఉగ్రవాదంపై అమెరికా 20 ఏళ్ల ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో చేరాలని పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రతిష్టను పణ్ణంగా పెట్టి అమెరికాతో చేతులు కలిపా అని..అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదంపై అమెరికా 20 ఏళ్ల పాటు జరిపిన పోరాటంలో పాకిస్థాన్‌ పాలుపంచుకోవడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం (డిసెంబర్ 21,2021)విదేశాంగ శాఖ అధికారుల సమావేశంలో ప్రధాని ఇమ్రాన్‌ ప్రసంగిస్తు ఈ విషయాన్ని అంగీకరించారు. ఇది కేవలం డబ్బు కోసం మాత్రమేనని..దీంట్లో ఏమాత్రం ప్రజా ప్రయోజనాలు లేవని..దేశ ప్రతిష్ఠను పణ్ణంగా పెట్టి అమెరికాతో చేతులు కలిపాం అని ఇమ్రాన్ మరోసారి విచారం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఫలితంగానే పాకిస్థాన్ 80,000మంది ప్రాణాలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

Read more : Pakista PM : తాలిబ‌న్లు సామాన్య పౌరులే : ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

దేశ ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా.. కేవలం డబ్బు కోసమే అమెరికాతో మా దేశం 2001లో చేతులు కలిపిందని.. వ్యాఖ్యానించారు. అఫ్ఘానిస్థాన్ విషయంలో అమెరికాతో కలిసి ముందుకెళ్లాలని 2001లో నిర్ణయం తీసుకున్నవారితో అంటే అప్పటి సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ( ఆ తరువాత ముషారఫ్ దేశ ప్రధాని అయ్యారు)తో ఆ రోజుల్లో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని తెలిపారు.

అందుకే అప్పటి పాకిస్థాన్ పరిస్థితులపై తనకు పూర్తిస్థాయి అవగాహన ఉందని వెల్లడించారు. ‘‘ఇతరులు మనల్ని వాడుకునేందుకు ఆరోజున పాకిస్థానే అవకాశమిచ్చిందని..దేశ ప్రతిష్ఠను పణంగా పెట్టామని ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా..డబ్బు కోసం విదేశాంగ విధానాన్ని రూపొందించామని తెలిపారు. అది మనకు మనమే చేసుకున్న గాయం అని..ఈ విషయంపై ఇతరులెవర్నీ నిందించలేం’’ అని ఇమ్రాన్‌ ఖాన్ సంచలన వాస్తవాలను బహిరంగంగా వెల్లడించారు.

Read more : Imran Khan: మగాళ్లు రోబోలు కాదు.. ఆడవారి దుస్తులపై పాక్ ప్రధాని!

కాగా అఫ్ఘాన్ లో అమెరికా సేనల కంటే ముందు రష్యా సేనలు అఫ్గాన్ లో మోహరించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అమెరికా అఫ్ఘాన్ లో మోహరించటానికి పాకిస్థాన్ కు ‘‘సోవియట్-ఆఫ్ఘాన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ..ఇది “పవిత్ర యుద్ధం”గా పిలిచారని ఇమ్రాన్ వెల్లడించారు. ఇలా అమెరికా ఆనాడు పాక్ కు ఏది చెప్పినా..ఆ తరువాత ఏది చేసినా గానీ..తుది నిర్ణయం తీసుకుని కేవలం డబ్బు కోసమే పాక్ అమెరికాతో చేతులు కలిపిందని..దీనికి పూర్తి బాధ్యత పాక్ దే నని..ఆ నిర్ణయం మనకు మనమే చేసుకున్న గాయం అని ఇతరుల్ని తప్పు పట్టలేమని వెల్లడించారు.

Read more :  Pakistan Pm Imran selling gifts : దేశానికి వచ్చిన బహుమతుల్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమ్మేసుకుంటున్నారట..!

ఆ నిర్ణయంతో 20 ఏళ్ల యుద్ధం ఫలితంగా పాకిస్తాన్ 80,000 మందికి పైగా మరణాలు.. USD 100-బిలియన్లకు పైగా ఆర్థిక నష్టాలను చవిచూసిందని ఖాన్ గతంలో పలుమార్లు తెలిపారు. ఇప్పుడు మరోసారి అమెరికాతో ఆనాడు కలిసి వేసిన అడుగులు తమ దేశ ప్రతిష్టకు తీరని గాయం అయ్యాయని అని తెలుపుతు ఆవేదన వ్యక్తం చేశారు.