Polar Bear Iceland : 8ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం కనిపించిన ధ్రువపు ఎలుగుబంటి.. కాల్చిచంపిన పోలీసులు!
Polar Bear Iceland : ఈ ధ్రువపు ఎలుగుబంటి 2016 నుంచి ఐస్‌లాండ్‌లో ఫస్ట్ టైమ్ కనిపించింది. 9వ శతాబ్దం నుంచి కేవలం 600 సార్లు మాత్రమే కనిపించాయి. ఈ ఎలుగుబంట్ల బరువు 150 నుంచి 200 కిలోగ్రాముల బరువు ఉంటుందని అంచనా.

Polar Bear Appears In Iceland For 1st Time In 8 Years
Polar Bear Iceland : అదో రిమోట్ ఐస్‌లాండ్.. మంచు ప్రదేశాల్లో చిన్నపాటి కుటీరాల్లో స్థానికులు నివాసముంటున్నారు. మంచుప్రదేశంలో అరుదుగా కనిపించే ధ్రువపు ఎలుగుబంటి ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. దాన్ని చూడగానే అక్కడి నివాసితులు భయాందోళనకు గురయ్యారు. ఓ ఇంటి వెలుపల ధ్రువపు ఎలుగుబంటి కనిపించడంతో స్థానికులకు ముప్పుగా భావించిన పోలీసులు దాన్ని కాల్చి చంపేశారు.
Read Also : శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం వేళ.. పవన్ కల్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
ధ్రువపు ఎలుగుబంటిని ముందుగా పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి వాయువ్య ఐస్‌లాండ్‌లో సెప్టెంబర్ 19న ఎలుగుబంటిని చంపేశారని వెస్ట్‌ఫ్జోర్డ్స్ పోలీసు చీఫ్ హెల్గి జెన్సన్ ఏపీ తెలిపారు. ఎలుగుబంటి ఇంటికి దగ్గరగా వచ్చిన సమయంలో అక్కడ ఒక వృద్ధురాలు ఒంటరిగా ఉందని అన్నారు.
ఎలుగుబంటిని చూడగానే ఆమె భయంతో మేడపైకి వెళ్లి దాక్కుంది. శాటిలైట్ లింక్ ద్వారా సాయం కోసం ఆమె రేక్‌జావిక్‌లోని తన కుమార్తెను సంప్రదించిందని జెన్సన్ చెప్పారు. ఎలుగుబంటి ద్వారా వృద్ధురాలి ప్రాణాలకు ముప్పు కలుగుతుందని భావించి కాల్చినట్లు స్పష్టం చేశారు. ఎలుగుబంటి భయంతో ఇప్పటికే చాలామంది ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. ఈ ఎలుగుబంట్లు ఐస్‌లాండ్‌కు చెందినవి కావని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే, కొన్నిసార్లు మంచు గడ్డలపై గ్రీన్‌లాండ్ నుంచి ధ్రువపు ఎలుగుబంటి ఒడ్డుకు చేరుకుంటాయి.
ఈ ధ్రువపు ఎలుగుబంటి 2016 నుంచి ఐస్‌లాండ్‌లో ఫస్ట్ టైమ్ కనిపించింది. 9వ శతాబ్దం నుంచి కేవలం 600 సార్లు మాత్రమే ఈ ధ్రువపు ఎలుగుబంట్లు కనిపించాయి. సాధారణంగా ఈ ఎలుగుబంట్ల బరువు 150 నుంచి 200 కిలోగ్రాముల బరువు ఉంటుందని అంచనా. ధ్రువపు ఎలుగుబంటిని అధ్యయనం కోసం పరిశోధన కేంద్రానికి శాస్త్రవేత్తలు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ధృవపు ఎలుగుబంట్లు మానవులపై దాడులు చేయడం చాలా అరుదు.
2017 అధ్యయనం ప్రకారం.. వాతావరణ మార్పుల కారణంగా ఆకలితో ఉన్న ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వస్తుంటాయి. మనషులపై దాడి చేసే ప్రమాదం ఉంది. 1870 నుంచి 2014 వరకు 5 ధ్రువ ఎలుగుబంట్లు కనిపించగా, కెనడా, గ్రీన్‌లాండ్, నార్వే, రష్యా, యునైటెడ్ స్టేట్స్‌లో 73 ఎలుగుబంట్ల దాడులు జరిగాయి. మనుషులపై జరిగిన దాడుల్లో 20 మంది మరణించగా, 63 మందికి గాయాలయ్యాయి.
Read Also : Devara Part 1: జూ.ఎన్టీఆర్ ట్వీట్‌తో రెండు కుటుంబాల మధ్య సంబంధాలు మళ్లీ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయా?