దేశంలో ఫస్ట్ టైం: మార్చి1 నుంచి బస్సు, రైళ్లల్లో ఉచిత ప్రయాణం!

  • Published By: sreehari ,Published On : February 28, 2020 / 03:00 AM IST
దేశంలో ఫస్ట్ టైం: మార్చి1 నుంచి బస్సు, రైళ్లల్లో ఉచిత ప్రయాణం!

Updated On : February 28, 2020 / 3:00 AM IST

పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వినియోగించుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకనుంచి బస్సుల్లో, రైళ్లలో ఎవరైనా సరే ఉచితంగా ప్రయాణించవచ్చు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మార్చి 1 నుంచి ప్రజా రవాణా సౌకర్యం ఉచితంగా అందుబాటులోకి రానుంది. ఎక్కడా అంటారా? మనదేశంలో కాదులేండీ.. యూరప్ ఖండంలోని లగ్జమ్‌బర్గ్ అనే చిన్న యూరోపియన్ దేశం. ఇక్కడి పేదరికంతో పాటు అసమానత్వాన్ని పూర్తిగా నిర్మూలించి అందరూ సమానమే అనే భావన తీసుకురావడమే లక్ష్యంగా ఈ విధానం అమల్లోకి తీసుకొస్తోంది ఆ దేశం.. పేద, ధనిక మధ్య వ్యత్యాసాలను తగ్గించడానికే ఇలాంటి ప్రణాళికను తీసుకొస్తున్నట్టు అక్కడి ప్రజా రవాణా శాఖ మంత్రి ఫ్రాన్సోస్ బాయిస్క్ బీబీసీతో చెప్పారు. 

తక్కువ వేతనం ఉన్నవారికి రవాణ ఖర్చులు అవసరమని అందుకే ప్రతిఒక్కరికి ప్రయాణం సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. ఆ దేశంలో ఇదివరకే ప్రజా రవాణా ఖర్చులు భారమేమి కాదు. ఒక టికెట్ కు రెండు పాయింట్ల మధ్య 2 యూరోలు (రూ.143) వరకు ధర ఉంటుంది. చాలామంది ప్రయాణికుల్లో 20ఏళ్ల లోపు యువకులకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. 30లోపు విద్యార్థులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. తక్కువ ఆదాయం వచ్చే వేతనజీవులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. అందుకే దీనిపై విమర్శకులు పెద్దగా ప్రయోజనం లేదంటూ వాదిస్తున్నారు. ఇక్కడి ఇళ్ల ధరలు అమాంతం పెరిగిపోవడం పెద్ద సమస్యగా మారిందని యూనివర్శిటీకి చెందిన పరిశోధకలు అభిప్రాయపడ్డారు. 

అయినప్పటికీ, రవాణాను నిర్వహించే ఏజెన్సీ దాని నిర్వహణ వ్యయాలలో 10శాతం మాత్రమే భరిస్తుందని, ప్రభుత్వం ఇప్పటికే తన రైలు నెట్‌వర్క్‌ను ఆధునీకరించడానికి, సరిహద్దుల్లో, రైళ్లు, వీధి కార్లు, బస్సుల మధ్య కనెక్షన్‌లను మెరుగుపరచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. 2025 నాటికి, 20శాతం ఎక్కువ మందిని ప్రజా రవాణాలో తరలించగలగాలి. కార్ల నుండి ప్రజలను ఆకర్షించాలని కూడా ఇది భావిస్తోంది.

ఈయూలో అత్యధిక కార్లు నడిపేవారు ఎక్కువగా ఉన్నారు. 60శాతం మంది ప్రయాణికులు ఇప్పుడు పని చేయడానికి డ్రైవ్ చేస్తారు. ప్రజా రవాణాలో 20శాతం కన్నా తక్కువ. కొన్ని సారూప్య మార్పులు బాగా పనిచేసినప్పటికీ, ఉచిత ఛార్జీలు ఆ సమీకరణాన్ని ఎంతవరకు మార్చగలవో చూడాలి. ఫ్రాన్స్‌లోని డన్‌కిర్క్ నగరం తన సొంత బస్సులను ఉచితంగా చేసినప్పుడు, వారాంతంలో ప్రయాణించేవారిలో 60శాతం మేర పెరిగారు.