41వేల వజ్రాలతో బంగారపు టాయ్‌లెట్ @రూ.8.5కోట్లు

41వేల వజ్రాలతో బంగారపు టాయ్‌లెట్ @రూ.8.5కోట్లు

Updated On : November 6, 2019 / 1:57 PM IST

బంగారంతో పాటు వజ్రాలు పొదిగిన టాయ్‌లెట్ అక్షరాలు రూ.8.5కోట్ల విలువైనది గిన్నీస్ రికార్డు కొట్టేసేందుకు సిద్ధమైంది. షాంగాయ్ లోని చైనా అంతర్జాతీయ రెండో దిగుమతి ఎక్స్ పో(సీఐఐఈ)లో దీనిని ఉంచారు. దీనిని తయారుచేయడానికి 40వేల 815 వజ్రాలు వాడారంట. 

అయితే దీనిని ఎవరి ఇంట్లో వాడుకోవడానికో తయారుచేయలేదు. హాంకాంగ్ జ్యూయలరీ కంపెనీ ఆరోన్ షమ్ వారి బ్రాండ్ మార్కెటింగ్ చేసుకోవడం కోసం దీనిని తయారుచేయించింది. టాయ్ లెట్ చేయించి దానిపూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్.. దానిపై 334.68క్యారెట్ల వజ్రాలు పొదిగారు. 

టాయ్‌లెట్ నిర్మాణంలో ఎన్నడూ లేనంతగా వజ్రాలు పొదగడంతో ఇది గిన్నీస్ రికార్డుకు యత్నిస్తున్నారట. దీంతో పాటు 400క్యారెట్ల విలువ చేసే వజ్రాలు తో 2మిలియన్ డాలర్ల గిటార్, రూ.30కోట్లు విలువ చేసే షూ జతను డిస్ ప్లే లో ఉంచారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆ సంస్థ యజమాని షమ్.. ఒక వజ్రాల మ్యూజియం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దాని ద్వారా మరికొంతమంది ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం’ అని తెలిపాడు. 

సెప్టెంబరు నెలలోనూ 18క్యారెట్ల రూ.8.88కోట్ల బంగారపు టాయ్‌లెట్ చోరీకి గురైంది. యూకే ప్రధాన మంత్రి విన్‌స్టన్ చర్చిల్ స్వస్థలంలోని బ్లెన్ హీమ్ ప్యాలెస్ నుంచి దానిని దొంగిలించారు. దానిని పట్టుకునే ప్రయత్నంలో థేమ్స్ వాలే పోలీసులు పలువురిని అరెస్టు చేసి విచారించినప్పటికీ వివరాలు తెలియలేదు. చివరికి ఆ బంగారపు టాయ్‌లెట్ పట్టించిన వారికి రూ.9కోట్ల 14లక్షల ప్రైజ్ మనీ ఇస్తామని కూడా ప్రకటించారు.