Russia Missile Strike : అది మా క్షిపణి కాదు.. భారత ఫార్మా కంపెనీపై దాడి చేయలేదు.. ఉక్రెయిన్ ఆరోపణలను ఖండించిన రష్యా..!

Russia Missile Strike : ఉక్రెయిన్‌లోని భారతీయ ఫార్మా కంపెనీ వేర్ హౌస్‌పై క్షిపణి దాడిపై ఆరోపణలను రష్యన్ రాయబార కార్యాలయం తోసిపుచ్చింది. ఉక్రెయిన్ వైమానిక రక్షణ నుంచి ప్రయోగించిన క్షిపణి అక్కడ పడిందని తెలిపింది.

Russia Missile Strike : అది మా క్షిపణి కాదు.. భారత ఫార్మా కంపెనీపై దాడి చేయలేదు.. ఉక్రెయిన్ ఆరోపణలను ఖండించిన రష్యా..!

X/@MartinHarrisOBE

Updated On : April 18, 2025 / 6:23 PM IST

Russia Missile Strike : కైవ్‌లోని కుసుమ్ హెల్త్‌కేర్ ఫార్మసీ వేర్ హౌస్‌పై దాడి చేసింది ఎవరు? ఇది రష్యా పనే అని ఉక్రెయిన్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అయితే, భారతీయ రష్యా రాయబార కార్యాలయం ఉక్రెయిన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.

2025 ఏప్రిల్ 12 నాటి సంఘటనపై రష్యా వివరణ ఇస్తూ.. తమ సైన్యం భారతీయ ఫార్మా కంపెనీ లక్ష్యంగా చేసుకోలేదని లేదా అలాంటి ప్లాన్ లేదని తెలిపింది. రష్యా క్షిపణి నేరుగా ఆ ప్రదేశాన్ని ఢీకొట్టిందని ఉక్రెయిన్ ఆరోపించింది. మాస్కో దేశంలోని భారతీయ వ్యాపారాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది.

Read Also : Air Coolers : కొత్త ఎయిర్ కూలర్ కొంటున్నారా? వేసవిలో ఏసీల కన్నా పవర్‌ఫుల్ కూలర్లు ఇవే.. ఫ్లిప్‌కార్ట్‌లో అతి చౌకైన ధరకే కొనేసుకోండి..!

ఉక్రెయిన్ ఆరోపణలపై స్పందించిన రష్యా అది మా క్షిపణి కాదు.. ముమ్మాటికి ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణి అయి ఉండొచ్చునని పేర్కొంది. ఈ దాడి వెనుక ఉక్రేనియన్ వైమానిక రక్షణ వ్యవస్థలే కారణమని పేర్కొంది. భారత్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో “ఉక్రేనియన్ వైమానిక రక్షణ క్షిపణులలో ఒకటి.. కుసుమ్ హెల్త్‌కేర్ వేర్ హౌస్‌పై పడి నిప్పు అంటుకుందని మాస్కో పేర్కొంది.

ఈ దాడిలో రష్యన్ దళాల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 12న కుసుమ్ ప్లాంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. రష్యన్ క్షిపణి నేరుగా ఆ ప్రదేశాన్ని ఢీకొట్టిందని ఉక్రెయిన్ ఆరోపించింది. రాజీవ్ గుప్తా యాజమాన్యంలోని కుసుమ్ హెల్త్‌కేర్, ఉక్రెయిన్‌లో పనిచేస్తున్న అతిపెద్ద ఫార్మా సంస్థలలో ఒకటి. దేశవ్యాప్తంగా ప్రాథమిక ఔషధాలను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

మేం దాడి చేయలేదు.. రష్యా ప్రకటన :
రష్యన్ రాయబార కార్యాలయం ప్రకారం.. ఆ రోజు రష్యన్ సైనిక చర్యకు లక్ష్యంగా దాడులు చేసింది. అందులో ఉక్రేనియన్ సైనిక పరిశ్రమ విమాన కర్మాగారం, సైనిక విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, సాయుధ వాహన మరమ్మతు కేంద్రాలు, డ్రోన్ అసెంబ్లీ వర్క్‌షాప్‌లు ఉన్నాయి.

ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థకు చెందిన ఒక క్షిపణి లక్ష్యాన్ని చేధించడంలో విఫలమై జనావాస ప్రాంతంలో పడిపోయి ఉండవచ్చు. రష్యా ఎప్పుడూ పౌర సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోలేదని రష్యన్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సైన్యం తరచుగా పట్టణ ప్రాంతాల్లో వైమానిక రక్షణ వ్యవస్థలను మోహరిస్తుందని దీనివల్ల పౌరులకు ముప్పు వాటిల్లుతుందని ప్రకటనలో పేర్కొంది.

ఉద్దేశపూర్వకంగానే రష్యా దాడి.. ఉక్రెయిన్ ఆరోపణ :
రాజధాని కైవ్‌లోని కుసుమ్ గ్రూప్ యూనిట్ ‘గ్లాడ్‌ఫార్మ్’పై డ్రోన్‌తో దాడి చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. యుద్ధ సమయంలో కుసుమ్ గ్రూప్ ఉక్రెయిన్‌కు ఎంతో సాయం అందించిందని, అందుకే ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఉక్రెయిన్‌లోని భారత రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌చుక్ పేర్కొన్నారు. ఈ దాడిలో కంపెనీకి దాదాపు 25 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. రష్యా ఇప్పుడు ఔషధ యూనిట్లను, అవసరమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటోందని ఉక్రెయిన్ ఆరోపించింది.

Read Also : SIP Investment : SIPలో పెట్టుబడికి సీక్రెట్ టిప్స్ తెలిస్తే.. సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అవ్వొచ్చు.. మీ అకౌంటులో డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది!

ఇరాన్ తయారు చేసిన ‘షహీద్’ డ్రోన్లను ఉపయోగించి రాత్రిపూట దాడులు నిర్వహిస్తోందని ఆరోపించింది. భారీ నష్టం కలిగినప్పటికీ వీలైనంత త్వరగా మందుల సరఫరాను పునరుద్ధరించే దిశగా కంపెనీ ప్రయత్నిస్తోందని కుసుమ్ గ్రూప్ వీడియో మెసేజ్ రిలీజ్ చేసింది.