Russia-Ukraine war : రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై బెలారస్ లో మరి కాసేపట్లో చర్చలు..
రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై బెలారస్ లో చర్చలకు ఏర్పాట్లు పూర్తి..అయ్యాయి. దీనికి సంబంధించి ఫోటోలు విడుదల అయ్యాయి.

Arrangements Are Complete For Talks On The Russia Ukraine War In Belarus. (1)
Russia-Ukraine war..Belarus Discussion talks :రష్యా-యుక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రపంచ దేశాన్ని ఖండించాయి. అయినా రష్యా మాత్రం ఐదవ రోజు యుద్ధాన్ని కొనసాగిస్తున్న క్రమంలోఇరు దేశాలు చర్చలకు సిద్ధమయ్యాయి. దీంట్లో భాంగా బెలారస్ లో మరికాసేపట్లో చర్చలు జరుపనున్నాయి. ఈ చర్చల కోసం బెలారస్ విదేశాంగ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చర్చల కోసం రష్యా అధికారులు ఆదివారం (ఫిబ్రవరి 27,2022)న బెలారస్ చేరుకున్నారు. చర్చల కోసం రష్యా అధికారుల బృందం యుక్రెయిన్ దేశపు ప్రతినిధుల కోసం ఎదురు చూస్తున్నామని బెలారస్ విదేశీ వ్యవహారాల శాఖ తాజాగా వెల్లడించింది. మధ్యాహ్నం 3.30కి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఉక్రెయిన్‌కు తూర్పుసరిహద్దులో రష్యా, ఉత్తరసరిహద్దులోబెలారస్ ఉంది. పశ్చిమసరిహద్దులో పోలాండ్, స్లోవేకియా,హంగేరిలు,నైరృతిసరిహద్దులో రొమేనియా, మెల్డోవాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి.దక్షిణసరిహద్దులో నల్లసముద్రం, ఆగ్నేయసరిహద్దులో అజోవ్ సముద్రం ఉన్నాయి. క్రిమీన్ ద్వీపకల్పం విషయంలో రష్యా, ఉక్రెయిన్ మద్య వివాదాలు ఉన్నాయి.
Also read : Russia Ukraine War: యుక్రెయిన్ లో కొనసాగుతున్న దాడులు ప్రతిదాడులు
బెలారస్ లో చర్చలకు సంబంధించి బెలారస్ అధికారులు చేసిన ఏర్పాట్లకు సంబంధించి ఓ ఫోటోను విడుదల చేశారు. మరోవైపు ఓ వైపు చర్చల కోసం ఏర్పాట్లు చేసిన రష్యా మరోవైపు యుక్రెయిన్ పై యుద్ధం చేయటం మాత్రం నిలుపుదల చేయటంలేదు. యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉంది. యుక్రెయిన్ సేనలు కూడా ఏమాత్రం తగ్గకుండా రష్యాను చావు దెబ్బ తీస్తున్నాయి.
యుక్రెయిన్‌పై దండెత్తిన రష్యాతో భీకర యుద్ధం నడుస్తోంది. రెండు రోజుల వరకు మౌనంగా ఉండిపోయిన యుక్రెయిన్ సేనలు ఊహించని రీతిలో రష్యా దళాలను ప్రతిఘటిస్తున్నాయి. రోజురోజుకీ యుద్ధ వాతావరణం మరింత తీవ్రంగా మారుతోంది. ఎవరూ ఊహించని విధంగా యుద్ధంలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చలకు రెడీ అంటూనే మరోవైపు అణు హెచ్చరికలు చేస్తున్నారు. అణుబాంబును ప్రయోగిస్తే.. ఎంతటి మారణహోమం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గతంలోనూ అణుబాంబు వల్ల వినాశనానికి దారితీసింది.
Also read : Russia-Ukraine war : కీవ్ లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత..రష్యా ఆర్మీని చావు దెబ్బ తీశాం : యుక్రెయిన్
ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి వస్తుందేమోనన్న భయం ప్రపంచ దేశాలకు పట్టుకుంది. రష్యా అణు హెచ్చరికలతో ప్రపంచదేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుక్రెయిన్, రష్యా మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేపట్టాయి. అందులో భాగంగానే శాంతి చర్చలకు కోసం రెండు దేశాలు అంగీకరించాయి. ఈ చర్చల కోసం ఇప్పటికే రష్యా ప్రతినిధులు బెలారస్ కు ఒకరోజు ముందే చేసుకుని యుక్రెయిన్ ప్రతినిధుల కోసం ఎదురు చూస్తున్నారు.మరి ఈ చర్చలు సఫలం అయి రష్యా యుద్ధం విరమిస్తుందా? లేదా కొనసాగిస్తుందో వేచి చూడాలి. ఈ చర్చలు ఫలితం ఏమేరకు యుద్ధాన్ని ఆపుతుందే వేచి చూడాలి.