Russia : 8 కంటే ఎక్కువమంది పిల్లల్ని కనండి.. మహిళల్ని కోరిన పుతిన్

పెద్ద కుటుంబాలను కాపాడుకోవడం మన నైతిక బాధ్యత అంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు. ఎనిమింది కంటే ఎక్కువమంది పిల్లల్ని కనమని ఆ దేశ మహిళలను కోరారు. ఎవరాయన?

Russia : 8 కంటే ఎక్కువమంది పిల్లల్ని కనండి.. మహిళల్ని కోరిన పుతిన్

Russia

Updated On : December 1, 2023 / 2:56 PM IST

Russia : రష్యా మహిళలు ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ పిల్లలకు జన్మనివ్వాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. పెద్ద కుటుంబాలను కలిగి ఉండటం నైతిక అవసరం అంటున్నారు పుతిన్.

Viral Video: రష్యా అమ్మాయిని నడిరోడ్డుపై వేధించిన భారతీయ యువకుడు.. యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసిన యువతి

జనాభా తగ్గుదలను అరికట్టడానికి ఎక్కువమంది పిల్లలను కలిగి ఉండాలని పౌరులను కోరారు పుతిన్. మాస్కోలో జరిగిన ప్రపంచ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న పుతిన్ అనేక అంశాలపై ప్రసంగించారు. రష్యన్ కుటుంబాలలో మన అమ్మమ్మలు, ముత్తాతలకు 7 నుండి 8 మంది పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని.. పెద్ద కుటుంబం కలిగి ఉండటం రష్యాలో ప్రజలందరికీ ఒక కట్టుబాటుగా, జీవన విధానంగా మారాలన్నారాయన. కుటుంబ సంప్రదాయాలను కాపాడుకోవడం నైతిక బాధ్యత అన్నారు పుతిన్.

రష్యా జనాభా ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోతోంది. ఉక్రెయిన్ యుద్ధంలో 3 లక్షల మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఆర్ధిక పరిస్థితులు, అనేక సంఘర్షణల నేపథ్యంలో రష్యాలో చాలామంది పిల్లల్ని కనకూడదని లేదంటే తాము మానసికంగా లేదా ఆర్ధికంగా స్థిరపడేవరకు వాయిదా వేయాలని నిర్ణయించుకుంటున్నారు. అంతేకాకుండా స్త్రీలు కూడా బాగా చదువుకోవడంతో పెళ్లి, పిల్లల్ని కనే వయసు క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యన్ల వైఖరిలో పెద్ద మార్పును డిమాండ్ చేస్తున్నారు పుతిన్.

Putin : 111 సార్లు పొడిచి ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తికి పుతిన్ క్షమాభిక్ష.. యుక్రెయిన్ యుద్ధభూమిలో రక్తంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారట!

పుతిన్ కు ముగ్గురు భార్యలని వారితో ఆయనకు ఆరుగురు పిల్లలు ఉన్నట్లుగా చెబుతారు. కానీ పుతిన్ ఇద్దరు కుమార్తెలను మాత్రమే బహిరంగంగా తన బిడ్డలుగా అంగీకరించారు.