2020 ఫోర్బ్స్-400 లిస్ట్ : అమెరికాలోని అత్యంత ధనవంతులలో 7 భారతీయులు

  • Published By: venkaiahnaidu ,Published On : September 9, 2020 / 03:33 PM IST
2020 ఫోర్బ్స్-400 లిస్ట్ : అమెరికాలోని అత్యంత ధనవంతులలో 7 భారతీయులు

Updated On : September 9, 2020 / 4:09 PM IST

ఫోర్బ్స్ అమెరికా కుబేరుల జాబితాలో భారత సంతతికి చెందిన 7గురుకి చోటు దక్కింది. 2020 సంవత్సరానికి గాను అమెరికాలోను అత్యంత ధనవంతులైన 400 మందితో కూడిన జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది. ఇందులో అమెరికాలో నివసిస్తున్న ఏడుగురు భారత సంతతి వ్యక్తులు ఉన్నారు.


ఫోర్బ్స్ 400 జాబితాలోని 7 భారతీయుల విషయానికి వస్తే...

సైబర్ సెక్యూరిటీ సేవల సంస్థ జెడ్‌‌స్కేలర్ సీఈఓ జైచౌదరి… 6.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఫోర్బ్స్ జాబితాలో 85వ స్థానంలో నిలిచారు. సింఫనీ టెక్నాలజీస్ గ్రూప్ చైర్మన్ రమేష్ వాద్వానీ… 3.4 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో 238వ స్థానం దక్కించుకున్నారు. ఆన్ ‌లైన్ హోంగూడ్స్, రిటైల్ సంస్థ వేఫెయిర్ వ్యవస్థాపకులు, సీఈఓ నీరజ్ షా… 2.8 బిలియన్ డాలర్లతో 299వ స్థానం పొందారు. ఖోస్లా వెంచర్స్ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లా… 2.4 బిలియన్ డాలర్లతో 353వ స్థానం దక్కించుకున్నారు. షేర్‌పా వెంచర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ కవిటర్క్ రామ్ శ్రీరామ్… 2.3 బిలియన్ డాలర్లతో 359వ స్థానంలో ఉన్నారు. ఎయిర్ లైన్స్ బిజినెస్‌లో ఉన్న రాకేష్ గాంగ్వాల్… 2.3 బిలియన్ డాలర్లతో 359వ స్థానం దక్కించుకున్నారు. వర్క్-డే సీఈవో అనిల్ భూశ్రీ… అనిల్ భూశ్రీ 2.3 బిలియన్ డాలర్లతో 359వ స్థానం దక్కించుకున్నారు.


మొత్తంగా, ఫోర్బ్స్- 400 జాబితాలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో నిలిచారు. 179 బిలియన్ డాలర్ల సంపదతో బెజోస్.. మొదటి స్థానం దక్కించుకున్నారు. వరుసగా మూడో ఏడాది బెజోస్.. మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం. ఇక, 111 బిలియన్ డాలర్ల సంపదతో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహా-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. 85 బిలియన్ డాలర్ల నికర సంపదతో పేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ మూడవ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో 2.5 బిలియన్ డాలర్ల నికర సంపదతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… 339వ స్థానంలో ఉన్నారు.