ఆసియాలోనే ఫస్ట్ : ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్‌కు సింగపూర్ ఆమోదం

Pfizer’s COVID-19 vaccine in Asia first : సింగపూర్‌లో ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్‌కు ఆమోదం లభించింది. ఫైజర్-బయోంటెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఆమోదం పొందిన సింగపూర్ మొదటి ఆసియా దేశంగా నిలిచింది. ఈ ఏడాది ఆఖరిలో సింగపూర్ లో వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
5.7 మిలియన్ల మంది జనాభా కలిగిన సింగపూర్ సిటీలో హెల్త్ కేర్ వర్కర్లు, వృద్ధులకు ముందుగా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు స్వల్ప స్థాయిలో ఉన్న దేశాల్లో సింగపూర్ ఒకటి. వచ్చే ఏడాదిలో మూడో త్రైమాసికానికి ప్రతిఒక్కరికి కరోనా వ్యాక్సిన్ సరిపోయేంతగా అందుబాటులోకి తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
సింగపూర్‌లో ముందుగా వ్యాక్సిన్ వేయించుకునేవారి జాబితాలో తాను ఒకరుగా ప్రధానమంత్రి Lee Hsien Loong (68) ఒక ప్రకటనలో తెలిపారు. ‘నాలాంటి సీనియర్ సిటిజన్లతో పాటు హెల్త్ కేర్ వర్కర్లకు ముందుగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోబోతున్నాం.
ఫైజర్ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని విశ్వసిస్తున్నాం’ అని లీ మీడియాకు వెల్లడించారు. ముందుగా హెల్త్ కేర్ వర్కర్లు, వాలంటీర్లు, వృద్ధులకు ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నట్టు ప్రధాని లీ పేర్కొన్నారు.
ఒక ఫైజర్ వ్యాక్సిన్ మాత్రమే కాకుండా సింగపూర్ ఇతర డ్రగ్ మేకర్లు అయినా మోడెర్నా, సినోవాక్ కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి కూడా కొనుగొలు ఒప్పందాలపై సంతకం చేసింది. వ్యాక్సిన్ కొనుగోలుపై పేమెంట్లు కూడా పూర్తి అయ్యాయి. ఈ రెండు కంపెనీల నుంచి వ్యాక్సిన్లపై మొత్తంగా 1 బిలియన్ సింగపూర్ డాలర్లకు పైగా వెచ్చించినట్టు అధికారులు వెల్లడించారు.
సింగపూర్ లోని అందరికి వ్యాక్సిన్ సరిపోయేలా వ్యాక్సిన్ మోతాదులను కొనుగోలు చేసినట్టు ఉన్నత ఆరోగ్య శాఖ అధికారి Kenneth Mak తెలిపారు. అమెరికా తమ వ్యాక్సిన్ ప్రొగ్రామ్ లాంచ్ చేసి చేసిన తర్వాత సింగపూర్ ఫైజర్ వ్యాక్సిన్ ఆమోదం పొందినట్టు ప్రకటించింది. మరోవైపు చైనా, రష్యా కూడా స్థానికంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను తరలించే ప్రయత్నాల్లో ఉన్నాయి.