Elon Musk: అంబర్ హర్డ్‭తో డేటింగ్, మాజీ భార్యతో రహస్యంగా 10వ బిడ్డ.. ఎలాన్ మస్క్ జీవితంలోని సంచలన రహస్యాల్ని బయటపెట్టిన జీవిత చరిత్ర!

ఎలాన్ మస్క్ తన చిన్నతనంలో దారుణంగా దెబ్బలు తినడం వల్ల అనేక సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. చిన్నతనంలో బెదిరింపుల కారణంగా దెబ్బల బారిన పడినట్లు ఈ పుస్తకంలో వెల్లడైంది. కొట్టడం చాలా తీవ్రంగా ఉండేదట. అందుకే మస్క్ ముఖం వికృతంగా మారిందట.

Elon Musk: అంబర్ హర్డ్‭తో డేటింగ్, మాజీ భార్యతో రహస్యంగా 10వ బిడ్డ.. ఎలాన్ మస్క్ జీవితంలోని సంచలన రహస్యాల్ని బయటపెట్టిన జీవిత చరిత్ర!

Elon Musk Surprising Truths: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలోన్ మస్క్ ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటారు. టెక్నాలజీలో, సంపాదనలోనే కాకుండా కాంట్రవర్సీల్లో కూడా ఆయన ముందుంటారు. సోషల్ మీడియా (Social Media) వేదికగా ఎలాన్ చేసే వ్యాఖ్యలపై తరుచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు టెస్లా, అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌తో (Space X) సహా అనేక పెద్ద కంపెనీలకు మస్క్ సీఈవో. ప్రస్తుతం ఆయనకు టెస్లాలో (Tesla) 23 శాతం వాటా ఉంది. ఆయన గరిష్ట ఆదాయం టెస్లా నుంచి వస్తుంది. ప్రస్తుతం ఎలోన్ మస్క్ వద్ద ఉన్న సంపద 234.1 బిలియన్ డాలర్లు (19 లక్షల 20 వేల 723 కోట్ల రూపాయలు). ఇది చాలా దేశాల జీడీపీ కంటే ఎక్కువ.

అయితే, తాజాగా అమెరికన్ రచయిత వాల్టర్ జాక్సన్ విడుదల చేసిన ఒక పుస్తకంలో ఎలాన్ మస్క్ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఇవి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పాత్రికేయుడు కూడా అయిన వాల్టర్ ఐజాక్సన్.. ఎలోన్ మస్క్‌పై రెండేళ్లపాటు కన్ను వేసి అతని జీవిత చరిత్రను రాశారు. ఆ పుస్తకమే తాజాగా విడుదలైంది. ఎలాన్‌కి వోక్ మైండ్ వైరస్ సోకడం నుంచి రహస్య బిడ్డను కనడం వరకు ఇందులో ప్రస్తావించారు.

మస్క్‌పై రాసిన ఈ జీవిత చరిత్రలో, ఆయనకు రహస్య బిడ్డను ఉన్నట్లు వెల్లడైంది. ఇది తెలిసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. వాస్తవానికి, ఇప్పటి వరకు ఎలోన్ మస్క్ 9 మంది పిల్లల గురించి మాత్రమే ప్రపంచానికి తెలుసు. ఈ పుస్తకంలో తన 10వ బిడ్డ గురించిన సమాచారం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ బిడ్డ మస్క్ మాజీ భార్య గ్రిమ్స్ కన్నట్లు తెలిసింది. వీరి పేరు టెక్నో మెకానియస్. గ్రిమ్స్‌తో ఎలాన్‌కి ఇది మూడో సంతానం. ఎలాన్ తన ఇద్దరు పిల్లల గురించి గ్రిమ్స్‌కు తెలియజేసారు. కాని ఆయన తన మూడవ బిడ్డను ప్రపంచం ముందు దాచిపెట్టారు. ఇటీవలి జీవిత చరిత్రలో ఈ రహస్యం వెల్లడైంది.

90 years Old Sisters : ఈ అక్కాచెల్లెళ్ల కలుసుకోవడం ఇదే చివరిసారి కావొచ్చు..అయినా ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో

మస్క్ ‘X’ హ్యాండిల్‌లో తన పిల్లల పేర్లకు అర్థాన్ని వివరించారు. దీనిలో ఆయన టెక్నో మెకానియస్ అర్థాన్ని గోళం యొక్క వ్యాసం, చుట్టుకొలతగా వివరించారు. ఎలాన్‌కు మూడు వివాహాలు అయ్యాయి. వారి ద్వారా 10 మంది పిల్లలు ఉన్నారు. మస్క్ జీవిత చరిత్రలో, ఆయన గురించి, జానీ డెప్ మాజీ భార్య అంబర్ హర్డ్ గురించి కూడా వెల్లడైంది. వాస్తవానికి, జానీ డెప్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అంబర్‌తో ఎలాన్ డేటింగ్ ప్రారంభించాడట. ఈ పుస్తకంలో ‘‘నేను 2013 సంవత్సరంలోనే అంబర్ హర్డ్‌ను కలిశాను. కానీ 2017లో జానీ డెప్‌తో విడాకులు తీసుకున్న తర్వాత మాత్రమే మేము డేటింగ్ ప్రారంభించాము’’ అని రాశారు. వారిద్దరూ పని విషయంలో ఎక్కువగా కలిసేవారని పుస్తకంలో పేర్కొన్నారు.

అంబర్ చాలా విషపూరితమైన మనస్తత్వమని ఎలాన్ కు ఒక సమయంలో తెలిసిందట. దాంతో ఆ సంబంధం కొంతకాలంలోనే ముగిసింది. ఎలాన్ మస్క్‌కి సన్నిహితులు కూడా అంబర్‌తో సంబంధాన్ని ఇష్టపడలేదట. ఎలోన్ మస్క్ తమ్ముడు కింబాల్ మస్క్ కూడా అంబర్ హిర్డ్ టాక్సిక్ అని పిలిచాడట. ఎలాన్ తరచుగా మనుషుల అందానికి ఆకర్షితులవుతాడని, అయితే ఆ అందమైన ముఖం వెనుక ఆ వ్యక్తి చీకటి కోణం కూడా ఉందని తనకు తెలియదని కింబాల్ మస్క్ చెప్పారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత అంబర్ హెర్డ్ తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేయడానికి కారణం ఇదేనని కింబాల్ చెప్పారు.

Asia Cup 2023 : పాకిస్తాన్‌పై శ్రీలంక సంచలన విజయం.. చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ, ఫైనల్లో భారత్‌తో ఢీ

ఎలోన్ మస్క్ తన తమ్ముడు కింబాల్ బిట్‌తో కలిసి జీప్2 కంపెనీని ప్రారంభించారు. ఆ సమయంలో అలెన్, కింబాల్ మధ్య అనేక ఘర్షణలు జరిగాయి. వాస్తవానికి ఆ ఆఫీసు స్థలం చాలా చిన్నది. దీని కారణంగా ఎవరికీ వ్యక్తిగత క్యాబిన్ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీసు సిబ్బందికి వారి ప్రతి గొడవ కనిపించేదట. ఒక్కసారిగా ఇద్దరి మధ్య పోరు పరిమితి చేరుకుని గొడవకు దిగింది. ఆ గొడవలో అతని తమ్ముడు తన చేతిని చాలా దారుణంగా కొరికాడని ఎలోన్ మస్క్ జీవిత చరిత్రలో వెల్లడైంది. దీంతో అతని చేతిలో నుంచి మాంసం కూడా బయటకు వచ్చింది.

దీని తర్వాత ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు, చేతికి కుట్లు పడ్డాయి. టెటానస్ ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. దీని గురించి ఎలాన్ సోదరుడు కింబాల్‌ను అడిగినప్పుడు, పోరాటంలో ఎలాన్ తన ముఖంపై కొట్టబోయాడని చెప్పారు. దీన్ని నివారించడానికి ఎలాన్ చేతిని కొరికాడట. స్పేస్ ఎక్స్ గురించి ఒక సమావేశానికి ముందు ఎలాన్ మస్క్ వోడ్కా తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడట. వాస్తవానికి ఈ కంపెనీని ప్రారంభించే ముందు ఒక మిషన్‌ను ప్రారంభించాలనుకున్నాడు. ఇది అంతరిక్ష పరిశోధనలపై ప్రజలకు ఆసక్తిని కలిగిస్తుంది. అతని మొదటి ప్రణాళిక “మార్స్ ఒయాసిస్” అని పేరు పెట్టారు. అంగారకుడిపైకి గ్రీన్‌హౌస్‌ను పంపడం ముఖ్య ఉద్దేశం.

స్పేస్ ఎక్స్ కంపెనీని ప్రారంభించడానికి సంబంధించి మస్క్ కొంతమంది రష్యన్ వ్యాపారవేత్తలతో సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో మీటింగ్ కి వెళ్లే ముందు మస్క్ పారిస్ లో ఆగి పార్టీలో పాల్గొన్నాడు. అక్కడ ఎక్కువగా వోడ్కా తాగడంతో ఆ ఇబ్బంది ఏర్పడింది. పార్టీలో తాను తక్కువ తిండి తిన్నానని, వోడ్కా ఎక్కువగా తాగానని ఎలాన్ ఈ పుస్తకంలో వెల్లడించారు. ఆ సమావేశానికి హాజరైనప్పుడు ఆయన స్పృహతప్పి పడిపోయాడట.

CM Mamata banerjee : స్పెయిన్‌‌లో దీదీ జాగింగ్ వీడియో వైరల్ .. అదే చీరకట్టుతో చలాకీగా

ఇక ట్విటర్ కొనుగోలు విషయంలో కూడా ఒక ఆసక్తికర విషయం వెల్లడైంది. నిజానికి టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి టెక్నాలజీ ఆధారిత కంపెనీల యజమాని ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నారనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మస్క్ కంపెనీ టెస్లా విలువ ట్రిలియన్ డాలర్లుగా మారిన సంవత్సరం అది. ఆ తర్వాత కూడా మస్క్‌కి అదనంగా 10 మిలియన్ డాలర్లు మిగిలాయి. అటువంటి పరిస్థితిలో, ఎలోన్ మస్క్ ఏదైనా చేయాలనుకున్నారు. ఆయన ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారనే వేరే చెప్పనక్కర్లేదు. పదేళ్లలో 19 వేల ట్వీట్లు చేశారు. ఆ తర్వాత ట్విట్టర్‌లో అన్నీ సరిగ్గా జరగడం లేదని భావించడం ప్రారంభించారట. అందుకే ఈ కంపెనీని కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.

Aliens: ఏలియన్స్ ఉన్నాయా? శాస్త్రీయ పద్ధతిలో తేల్చిన నాసా.. కొన్ని గంటల్లో..

ఎలాన్ మస్క్ తన చిన్నతనంలో దారుణంగా దెబ్బలు తినడం వల్ల అనేక సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. చిన్నతనంలో బెదిరింపుల కారణంగా దెబ్బల బారిన పడినట్లు ఈ పుస్తకంలో వెల్లడైంది. కొట్టడం చాలా తీవ్రంగా ఉండేదట. అందుకే మస్క్ ముఖం వికృతంగా మారిందట. అయితే ముఖం, ముక్కు బాగు చేయించుకోవడానికి చాలా సర్జరీలు చేసుకున్నారట.