పోరాటానికి ఎన్నడూ దూరం కాబోము: ఓటమిపై కమలా హారిస్ ప్రసంగం

తాము కష్టపడి పనిచేయాలనుకుంటున్నామని అన్నారు. దేశం కోసం చేసే పోరాటం ఎల్లప్పుడూ గొప్పదేనని హారిస్ తెలిపారు.

పోరాటానికి ఎన్నడూ దూరం కాబోము: ఓటమిపై కమలా హారిస్ ప్రసంగం

Kamala Harris

Updated On : November 7, 2024 / 2:39 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఇవాళ ప్రసంగించారు. కొన్నిసార్లు పోరాటానికి కొంత సమయం పడుతుందని, అయితే, అది మనం ఎప్పటికీ గెలవలేమన్న విషయానికి సంకేతం కాదని అన్నారు.

పోరాటానికి ఎన్నడూ దూరం కావద్దని చెప్పారు. అమెరికన్లుగా తాము అధ్యక్షుడికో, పార్టీకో రుణపడి ఉండబోమని, దేశ రాజ్యాంగం పట్ల విధేయతతో ఉంటామని అన్నారు. స్వేచ్ఛ కోసం చేసే పోరాటంలో చాలా కష్టపడాలని చెప్పారు.

తాము కష్టపడి పనిచేయాలనుకుంటున్నామని అన్నారు. దేశం కోసం చేసే పోరాటం ఎల్లప్పుడూ గొప్పదేనని హారిస్ తెలిపారు. ప్రజాస్వామ్యం, చట్టం, సమన్యాయం కోసం చేసే పోరాటాన్ని ఎన్నటికీ విడవబోమని చెప్పారు.

స్వేచ్ఛ, అవకాశాలు, న్యాయం, గౌరవం కోసం చేసే పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకుంటున్నప్పటికీ, తమ ప్రచారానికి ఆజ్యం పోసిన పోరాటం ఓడిపోయిందన్న విషయాన్ని మాత్రం తాను అంగీకరించనని తెలిపారు. తనపై మద్దతుదారులు ఉంచిన నమ్మకానికి తన హృదయం కృతజ్ఞతతో నిండిఉందని అన్నారు.

కూతురు కన్నీళ్లు పెట్టుకోవటం చూసి పవన్ కళ్యాణ్ బాధపడ్డారు : సీఎం చంద్రబాబు