Lim Nahee : 24 ఏళ్ల వయసులో మరణించిన ఆ సింగర్.. ఏమైందంటే?

పాపులర్ సింగర్, లిరిసిస్ట్ కన్నుమూయడం సంచలనంగా మారింది. ఎవరా సింగర్? ఆమెకు ఏమైంది?

Lim Nahee : 24 ఏళ్ల వయసులో మరణించిన ఆ సింగర్.. ఏమైందంటే?

Lim Nahee

Updated On : November 10, 2023 / 5:39 PM IST

Lim Nahee : సౌత్ కొరియా సింగర్, లిరిసిస్ట్ లిమ్ నహీ మరణం సంచలనం రేపుతోంది. నహీ మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.

Spider Bite : ఓ మై గాడ్.. సాలీడు కుట్టడంతో సింగర్ మృతి, అసలేం జరిగిందంటే..

దక్షిణ కొరియా సింగర్, పాటల రచయిత్రి లిమ్ నహీ మరణ వార్త సంచలనం రేపింది. రంగస్థల పేరు నహీతో సుపరిచితురాలైన ఆమె బుధవారం మరణించారు. మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులు వెల్లడించాల్సి ఉంది. నహీ అంత్యక్రియలు జియోంగ్గీ ప్రావిన్స్‌లోని ప్యోంగ్‌టెక్‌లో జరుగుతాయని తెలుస్తోంది.

24 ఏళ్ల లిమ్ నహీ మరణం ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నహీ చివరి పోస్టుపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. పోస్ట్‌లో సెల్ఫీతో సహా కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోను ట్రైన్ జర్నీలో నహీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఫోటోతో పాటు తన పెంపుడు కుక్క ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.

Divorce : విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీలు.. ప్రముఖ సింగర్ దంపతుల డివోర్స్

నహీ మరణంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విచారం వ్యక్తం చేసారు. ‘మీ అందమైన స్వరం, పాటలు మాకెంతో ఓదార్పునిచ్చాయి.. మీ సంగీతం సజీవంగా ఉంది.. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము’.. అంటూ కామెంట్లు పెట్టారు. నహీ 2019 లో ‘బ్లూ సిటీ’ అనే సింగిల్‌తో అరగేంట్రం చేశారు. తర్వాత ‘బ్లూ నైట్’, ‘గ్లూమీ డే’ వంటి సింగిల్స్ వచ్చాయి. 2020 లో నహీ గాయనిగా, పాటల రచయిత్రిగా, నిర్మాతగా కూడా ఆల్బమ్ విడుదల చేసారు. ‘ H!’, ‘రోజ్’ తాజాగా విడుదల అయ్యాయి.

 

View this post on Instagram

 

A post shared by 나히(Nahee) (@im_na._.hee)