నాశిరకం చైనా కరోనా టెస్ట్ కిట్‌లు మా కొంపముంచాయి. స్పెయిన్ గగ్గోలు, కరోనా మరణాల్లో ఇటలీ తర్వాత స్పెయినే

స్పెయిన్ లోని మైక్రో బయాలజీ నిపుణులు కరోనా వైరస్ టెస్టులు పాజిటివ్ కేసులు కన్ఫామ్ చేయలేకపోతున్నామని చేతులెత్తేశారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఇటలీ తర్వాత స్పెయిన్‌లోనే ఎక్కువ. స్పెయిన్ లో జరిపిన పరిశోధనల తర్వాత కేవలం 30శాతం మాత్రమే కచ్చితంగా రిపోర్టులు వస్తున్నాయంటున్నారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా టెస్టులు చేయడంలో 80శాతం కచ్చితత్వం తీసుకురావలసి ఉంది.
దీనిని బట్టే అర్థమవుతోంది స్పెయిన్ లాబరేటరీలు టెస్టులు చేయడంలో ఫెయిల్ అవుతున్నాయని. హెల్త్ వర్కర్లు ఈ మేరకే ఇతర టెస్టులు వాడి కరోనాని కన్ఫామ్ చేసుకుంటున్నారు కాకుంటే ఇవి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటాయి. గురువారం స్పెయిన్ సెంటర్ ఫర్ హెల్త్ అలర్ట్స్ అండ్ ఎమెర్జెన్సీ డైరక్టర్ ఫెర్నాండో సీమోన్ మాట్లాడుతూ.. వారు చేసిన 9వేల టెస్టుల్లో ఒక్కటి కూడా సంతృప్తికరంగా అనిపించడం లేదు.
స్పెయిన్ ఆరోగ్య శాఖ ఈ టెస్టులపై నిరుత్సాహం చూపిస్తుండటం మరోవైపు కరోనా లక్షణాలు వందల్లో బయటపడుతుండటం అందరినీ బాధిస్తున్న అంశం. కొత్త రకమైన టెస్టులు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం లేదు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా మార్చి 26నాటికి 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ టెస్టులు చైనీస్ బయోటెక్నాలజీ కంపెనీ బయోఈసీ నిర్వహించింది.
గురువారం స్పెయిన్‌లో ఉన్న చైనా ఎంబస్సీ ట్విట్టర్ ద్వారా స్థానికులకు మెడికల్ సప్లైస్ విరాళమిస్తున్నట్లు ప్రకటించింది. స్పెయిన్ ఇప్పటివరకూ చైనా.. దక్షిణకొరియా నుంచి 6లక్షల 40వేల కిట్లు కొనుగోలు చేసింది. వారంతా చైనా నుంచి వచ్చిన మెడికల్ సప్లైలుసరిగా పనిచేయడం లేదని అంటున్నారు. పైగా ఈ కిట్ లతోనూ టెస్టులు నిర్వహించేది బయోఈసీనే.
ప్రస్తుత కరోనా మరణాలతో స్పెయిన్.. ఇటలీ తర్వాతి స్థానంలో నిలిచింది. 2019 సంవత్సరాంతంలో చైనాలో పుట్టిన ఈ కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా 56వేలకు వచ్చి చేరాయి. ఇటలీ, స్పెయిన్, చైనా తర్వాత నిలిచింది అమెరికా.
See Also | 35 ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు ICMR నిర్ణయం