వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ..బాత్రూంలోకెళ్లి స్నానం చేసిన కౌన్సిలర్

టీవీలో లైవ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఓ వ్యక్తి మాట్లాడుతూ..మాట్లాడుతూ..సడెన్ గా లేచి బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆన్‌లైన్‌లో మాట్లాడుతోన్న సమయంలో బాత్రూంలో స్నానం చేసిన ఘటన ఉత్తర స్పెయిన్‌లోని కాంటాబ్రియాలోజరిగింది.
ఉత్తర స్పెయిన్‌లోని కాంటాబ్రియాలోని టొరెలావెగా కమ్యూనిటీకి పార్ట్‌టైమ్ కౌన్సిలర్‌గా పనిచేస్తున్న బెర్నాడో బుస్టిల్లా ఇంపార్టెంట్ విషయంపై అధికారిక సమావేశం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. బెర్నాడో వేరే ఉద్యోగం కూడా చేస్తున్నాడు. లాక్ డౌన్ తో ఇంటినుంచే పనిచేస్తున్నాడు. అదే సమయంలో కౌన్సిలర్ గా అధికారిక వీడియో సమావేశంలో పాల్గొనాల్సి వచ్చింది. అది లైవ్ సమావేశం టీవీలో కూడా ప్రసారమైంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ సమావేశం జరిగింది.
కాగా..బైటకు పనిమీద వెళ్లిన తన కూతురిని తీసుకురావటానికి టైమ్ కావటంతో బెర్నాడో స్నానం చేయాలని హడావుడి పడ్డాడు.
అయితే, మీటింగ్‌లో చెబుతున్న విషయాలను వినడం కూడా అంతే ముఖ్యం. దీంతో తన లాప్‌టాప్ తో సహా బాత్రూమ్‌లోకి పట్టుకెళ్లాడు. ఆ తరువాత తన వీడియో కనిపించకుండా ఉండేందుకు ఒక బటన్ నొక్కాల్సిందిపోయి, మరో బటన్ నొక్కాడు. దీంతో అతను బాత్రూమ్ లో స్నానం చేసిన వీడియో కూడా అందరికీ కనిపించింది.
దీంతో అధికారులు ఇదేంటీ అంటూ విస్తుపోయారు. ఆ విషయం గురించి అతనితో మాట్లాడాలని ప్రయత్నించినా, షవర్ నుంచి వస్తున్న నీళ్ల సౌండ్ కు వారి మాటలు అతనికి వినిపించలేదు. దీని గురించి కొలీగ్స్ కూడా యత్నించటానికి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే అతని ఫోన్ రూమ్ లోనే ఉండిపోయింది. దీంతో ఇక బాగుండదనుకున్నారో ఏమో వీడియో కాన్ఫరెన్స్ వాయిదా వేశారు. ఆ తరువాత ఇంకేముంది? వెంటనే అతడిని వెంటనే రాజీనామా చేయాలని అధికారులు ఆదేశించారు.