Donald Trump : ట్రంప్ నిర్ణయాలతో భారత్ కు లాభమా? నష్టమా? ఇండియన్స్ ఉద్యోగాలు సేఫేనా?

భారత అభివృద్ధిలో ట్రంప్ సర్కార్ భాగస్వామ్యం ఎంత?

Donald Trump : ట్రంప్ నిర్ణయాలతో భారత్ కు లాభమా? నష్టమా? ఇండియన్స్ ఉద్యోగాలు సేఫేనా?

Updated On : December 16, 2024 / 1:39 AM IST

Donald Trump : అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టే సమయం ఆసన్నమైంది. సరిగ్గా జనవరి 20న బాధ్యతలు చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పగ్గాలు చేతికి రాగానే తాను చేయబోయే దానిపై రోజుకో ప్రకటన చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారాయన. ట్రంప్ నిర్ణయాలతో జరిగే నష్టాలు ఏంటి, వచ్చే లాభాలు ఏంటి? అని ప్రపంచ దేశాలు లెక్కలు వేసుకుంటున్నాయి. మరి ట్రంప్ సర్కార్ భారతీయులను చిక్కుల్లోకి నెడుతుందా? జనవరి 20 తర్వాత అమెరికాలో భారత వలసదారుల పరిస్థితి ఏంటి? భారతీయ వస్తువులపై సుంకాలు పెంచనున్నారా?

ట్రంప్ సర్కార్ లో భారత వలసదారుల పరిస్థితి ఏంటి? హెచ్ 4 వీసాపై ఇక ఉద్యోగం చేయలేరా? దిగుమతి వస్తువులపై సుంకాలు పెంచనున్నారా? డొనాల్డ్ ట్రంప్ నినాదం వివాదం మన విద్యార్థులు, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ట్రంప్ జనవరి 20న బాధ్యతలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. క్యాబినెట్ కూర్పు నుంచి నిర్ణయాల వరకు ట్రంప్ పాలన ఎలా ఉండబోతోంది? ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో అనేదానిపై రోజుకో హింట్ ఇస్తున్నారు ట్రంప్. ఏం చేయబోయేది, ఎలా ఉండేది అన్నదానిపై క్లారిటీ ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అయితే, ట్రంప్ నిర్ణయాలు మన ఇండియన్స్ కు కష్టాలు తీసుకొచ్చేలా ఉన్నాయనే భయాలు నెలకొన్నాయి.

ట్రంప్ సర్కార్ లో భారత్ కి నష్టాలే కాదు కాసిన్ని ప్రయోజనాలు కూడా కనిపిస్తున్నాయి. ఇమిగ్రేషన్ విషయంలో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైనా.. వ్యాపార, రక్షణ విషయంలో మేలే జరుగుతుందని భారత్ ఆశలు పెట్టుకుంది. మరి ఆ ప్రయోజనాలు ఏంటి? భారత అభివృద్ధిలో ట్రంప్ సర్కార్ భాగస్వామ్యం ఎంత? ట్రంప్ తో మోదీకి ఉన్న స్నేహంతో ఇండియాకు ఏమైనా కలిసి వస్తుందా?

 

Also Read : ట్రంప్ అన్నంత పనిచేస్తారా? 18వేల మంది భారతీయులకు బహిష్కరణ తప్పదా?