Syria Civil War : సిరియాను వెంటాడుతున్న ఆ కొత్త భయం ఏంటి? ఆ దేశ ప్రజలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైంది సిరియా పరిస్థితి. అసద్ పాలన అంతమైనందుకు హ్యాపీగానే ఉన్నా..

Syria Civil War : యుద్ధం చేసే సత్తా లేని వాడికి శాంతి గురించి మాట్లాడే హక్కు ఉందో లేదో తెలియదు కానీ, యుద్ధంతోనే శాంతిని నెలకొల్పొచ్చు అంటే అది కచ్చితంగా అసాధ్యమే. అతివాదుల చేతుల్లోకి దేశాలు వెళ్లడం అంటే భవిష్యత్తును ఊహించుకోవడం కూడా భయమే. అలాంటిది ఇప్పుడు అతివాదుల చేతుల్లోకి దేశాలు వెళ్తున్నాయి. సిరియా విషయంలో జరిగింది ఇదే. గతంలో అఫ్ఘానిస్థాన్ తో పాటు మరికొన్ని దేశాల్లో కనిపించింది అదే. మరిప్పుడు సిరియాలో ఏం జరగబోతోంది? అప్ఘానిస్థాన్ తో పోలిక ఎందుకు వస్తోంది?
సిరియాలో అసద్ శకం ముగిసింది. దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లింది. డమాస్కస్ ను రెబల్స్ ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు పారిపోయాడు. బషర్ కు ఆశ్రయం కల్పించినట్లు రష్యా ప్రకటించింది. 55 ఏళ్ల అసద్ కుటుంబ పాలన ముగియడంతో జనాలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. 13ఏళ్లు జరిగిన అంతర్ యుద్ధంలో సిరియా చూసిన కన్నీళ్లు అన్నీ ఇన్నీ కావు. 2000లో సిరియా అధ్యక్షుడిగా అసద్ బాధ్యతలు తీసుకోగా.. 2011 నుంచి దేశంలో వ్యతిరేకత ప్రారంభమైంది.
అసమ్మతి గళాలను అణచివేయడానికి క్రూరమైన విధానాలను అనుసరించారు. దీంతో అది అంతర్ యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో 5 లక్షల మంది చనిపోగా 2 కోట్ల మందికిపైగా జనం నిరాశ్రయులుగా మిగిలారు. సొంత జనాలపైనే రసాయన దాడులు, సిలిండర్ దాడులు చేసిన అపకీర్తిని అసద్ మూటగట్టుకున్నారు. అయితే 13ఏళ్ల పోరాటానిక ఫలితంగా ఇప్పుడు అసద్ పాలన అంతమైంది.
పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైంది సిరియా పరిస్థితి. అసద్ పాలన అంతమైనందుకు హ్యాపీగానే ఉన్నా.. ఈ అతివాద గ్రూపుల చేతుల్లోకి పాలన వెళ్లడమే కాస్త టెన్షన్ పెడుతోంది. మరి సిరియాలో ఏం జరగబోతోంది? సంబరాలు కనిపిస్తున్న సిరియా వీధుల్లోనే భయాలు కనిపిస్తున్నాయి ఎందుకు? అసద్ పాలన అంతమైనంత మాత్రాన సిరియాకు మంచి రోజులు వచ్చినట్లు కాదా? అసలు సవాళ్లు ముందున్నాయా?
పూర్తి వివరాలు..
Also Read : అమెరికాలో అక్రమ వలసదారులకు మరోసారి ట్రంప్ వార్నింగ్.. ‘జన్మహక్కు పౌరసత్వం’పై కీలక వ్యాఖ్యలు