Zelenskyy car accident: కారు ప్రమాదానికి గురైన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కారును ప్రమాదవశాత్తూ మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో జెలెన్ స్కీకి స్వల్పగాయాలు అయ్యాయని ఆయన ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. జెలెన్ స్కీ ఖార్కివ్ ప్రాంతం నుంచి కీవ్ కు కారులో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం యుక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే.

Zelenskyy car accident: కారు ప్రమాదానికి గురైన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

Russia Ukraine war

Updated On : September 15, 2022 / 7:53 AM IST

Zelenskyy car accident: యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కారును ప్రమాదవశాత్తూ మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో జెలెన్ స్కీకి స్వల్పగాయాలు అయ్యాయని ఆయన ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. జెలెన్ స్కీ ఖార్కివ్ ప్రాంతం నుంచి కీవ్ కు కారులో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం యుక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే.

తాము రష్యా నుంచి ఖర్కివ్‌ లోని ఇజియం పట్టణాన్ని తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నామని రెండు రోజుల క్రితమే జెలెన్ స్కీ ప్రకటించారు. అంతేగాక, ఖర్కివ్‌ లోని రెండు ప్రాంతాల నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు రష్యా కూడా ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీ ఖార్కివ్ లోని ఇజియం ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఓ ప్రయాణికుడి వాహనమే జెలెన్ స్కీ కారును ఢీ కొట్టిందని ఆయన ప్రతినిధి సెర్గీ నికిఫోరోవ్ ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు.

అంతేగాక, జెలెన్ స్కీ కారును ఢీ కొన్ని వాహనంలోని డ్రైవర్ కు తమ వైద్య బృందమే ప్రాథమిక చికిత్స అందించి, అంబులెన్సులో ఆసుపత్రికి తరలించిందని చెప్పారు. ఈ ప్రమాదంలో జెలెన్ స్కీ శరీరంలోని ఏ భాగానికి గాయమైందన్న వివరాలు తెలియరాలేదు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Taliban on Masood Azhar: మసూద్‌ అజర్‌ అఫ్గాన్‌లో ఉన్నాడంటూ పాక్ ప్రకటన.. స్పందించిన తాలిబన్లు