నాలుగవ రోజు : శ్రీలంకలో మరో బాంబు పేలుడు

కొలంబో : శ్రీలంకలో రాజధాని కొలంబో బాంబుల మోతతో దద్ధరిల్లుతోంది. గత నాలుగు రోజుల నుంచి బాంబులు పేలుతునే ఉన్నాయి. ఈ క్రమంలో కొలంబోలో మరో బాంబు పేలింది. సోవోయ్ సినిమాస్ వద్ద ఈ పేలుడు సంభవించింది. ఆదివారం (ఏప్రిల్ 21) న వరుస బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ బాంబు పేలుళ్లు ఆగటంలేదు. ఈరోజు పేలిన బాంబుతో పేలుళ్ల సంఖ్య 8కి చేరింది. కాగా భద్రతాదళాల అప్రమత్తంగా వ్యవహరించటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. భారీగా ఆస్తినష్టం జరిగింది.
Also Read : లంకలో నరమేథం : 359కి చేరిన మృతులు
శ్రీలంకలో వరుస పేలుళ్లకు ప్లాన్ చేసిన ఐసిస్ వందలాదిమందిని పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనల్లో ఇప్పటి వరకూ 321 మంది మృతి చెందగా..500ల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన ఐసిస్ ఉగ్రవాదు పన్నాగాలను గుర్తించేందుకు పోలీసులు, ఆర్మీ ముమ్మర తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీలలో భాగంగా ఇప్పటికే తొమ్మిది బాంబులను భద్రతాదళాలు నిర్వీర్యం చేసారు. కాగా ఈ పేలుళ్లు సంభవించిన నాటి నుంచి ప్రభుత్వం ఐసీసీ సానుభూతిపరులుగా అనుమానించిన 120మందిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది.
Also Read : శ్రీలంక పేలుళ్లలో మహిళా సూసైడ్ బాంబర్