Sunita Williams : సునీతా విలియమ్స్ తిరిగి భూమిపైకి వచ్చేది ఎప్పుడో తెలుసా? ఇంతకీ ఎలా తీసుకొస్తారంటే?

Sunita Williams : వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ దాదాపు తొమ్మిది నెలల తర్వాత భూమికి తిరిగి రానున్నారు.

Sunita Williams : సునీతా విలియమ్స్ తిరిగి భూమిపైకి వచ్చేది ఎప్పుడో తెలుసా? ఇంతకీ ఎలా తీసుకొస్తారంటే?

Sunita Williams Earth Return

Updated On : March 16, 2025 / 1:05 AM IST

Sunita Williams : అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్‌మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు. నాసా ప్రకారం.. భూమి మీదకు ఈ నెల 19, 20 తేదీల్లో తిరిగి రావొచ్చునని స్పష్టం చేసింది. 10 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉంటున్న ఈ ఇద్దరు వ్యోమగాములు ఎట్టకేలకు భూమిపైకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

గత కొన్నినెలల క్రితమే 58 ఏళ్ల సునీతా విలియమ్స్, 61 ఏళ్ల విల్‌మోర్ బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్షనౌకలో అంతరిక్షానికి పయనమైయ్యారు. కొత్త వ్యోమనౌక పనితీరును పరీశీలించేందుకు సునీతా, విల్‌మోర్‌ స్పేస్‌కు వెళ్లారు. కానీ, ఊహించని పరిణామాలతో జూన్ 5న ఫ్లోరిడాలో టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

Read Also : SIP Investments : మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా జస్ట్ రూ.1000 ఆదా చేయండి.. 20 ఏళ్లలో రూ.10 లక్షలపైనే సంపాదించుకోవచ్చు!

నాసా అధికారులు ఈ సాంకేతిక సమస్యలను అర్ధం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం శూన్యం.. చేసేది ఏమిలేక వ్యోమగాములను అంతరిక్ష నౌకలోనే వదిలేసి స్టార్ లైనర్ సెప్టెంబర్ 7, 2024న భూమిపైకి తిరిగి వచ్చింది. ఆ పరిస్థితుల్లో భూమిపైకి ఇద్దరు వ్యోమగాములను తీసుకురావడం ప్రమాదకరమని నాసా భావించింది.

ఈ నెల 19, 20 తేదీల్లో రావొచ్చు : ఎలా తీసుకువస్తారంటే? 
ఆ తర్వాత విల్‌మోర్‌, సునీత విలియమ్స్ ఇద్దరూ అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ముందుగా స్పేస్ ఎక్స్ డ్రాగన్‌ ద్వారా వారిద్దరిని భూమిపైకి తీసుకురావాలని భావించారు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వీరిని వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు అప్పగించారు. నాసా ప్రకారం.. సునీతా, విల్ మోర్ ఈ నెల 19, 20 తేదీల్లో భూమిపైకి తిరిగి రావచ్చు.

సాధారణంగా అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదని సంగతి తెలిసిందే. దీని కారణంగా అంతరిక్షంలో ఉండే వ్యోమగాముల కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత ఒక్కసారిగా క్షీణించిపోతాయి. స్పేస్ వాతావరణంలో ఎముకల బరువు కోల్పోతాయి.

దాంతో ఎముకలు పెళుసుగా మారే అవకాశం ఉంటుంది. 6 నెలల కన్నా ఎక్కువకాలం అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు భూమిపైకి తిరిగి రాగానే బోన్ ఫ్రాక్చర్ రిస్క్‌ ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు. ఎముకల సాంద్రత కోసం 3 నెలల పాటు సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

9నెలలకు పైగా అంతరిక్షంలోనే ఉన్న సునీతా విలియమ్స్ అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా రికార్డు సాధించారు. 21 గంటలకు మించి అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేసిన సునీత రికార్డును నెలకొల్పి తన పేరున లిఖించుకున్నారు.

Read Also : BSNL Recharge Plan : వావ్.. వండర్‌ఫుల్.. BSNL అద్భుతమైన ప్లాన్ ఇదిగో.. ఒకసారి తీసుకుంటే.. 6 నెలలు రీఛార్జ్ చేయక్కర్లేదు..!

సునీతా విలియమ్స్ ఎవరంటే? :
సునీత లిన్ విలియమ్స్ భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి. ఎక్స్‌పెడిషన్-14 బృందంలో సునీతా విలియమ్స్‌ను నాసా చేర్చింది. అమెరికాలో ఓహియోలో 1965లో సునీత విలియమ్స్ జన్మించారు. 1958లో అహ్మదాబాద్ నుంచి అమెరికాలో ఆమె తండ్రి స్థిరపడ్డారు.

దీపక్ పాండ్యా, బోనీ పాండ్యాలు సునీత తల్లిదండ్రులు కాగా, ఆమె భర్త మైఖేల్ విలియమ్స్ కూడా పైలట్. ప్రస్తుతం పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1998లో నాసా వ్యోమగామిగా సునీత ఎంపిక అయ్యారు. అలాగే, యూఎస్ నావల్ అకాడమీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సునీత విలియమ్స్ మొదటిసారిగా నావల్ ఏవియేటర్‌గా కూడా పనిచేశారు.