Swine Fever Outbreak: 900 పందులను బాధాకరంగా చంపేందుకు ఆదేశాలు.. కారణం ఏంటో తెలుసా?
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF)కి సంబంధించి, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ (WOAH) స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యాది వ్యాప్తి కొనసాగడం పందుల పరిశ్రమకు ఆందోళన కలిగించే విషయమని చెప్పింది

హాంకాంగ్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వేగంగా విస్తరిస్తోంది. దీని కారణంగా పశువుల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా, స్వైన్ ఫీవర్ వ్యాప్తిని అరికట్టేందుకు హాంకాంగ్ పశువైద్యుల బృందం 900కు పైగా పందులను చంపాలని ఆదేశించింది. న్యూ టెరిటరీస్ జిల్లాలో లైసెన్స్ పొందిన వ్యవసాయ క్షేత్రంలో జంతువులలో ప్రాణాంతక వ్యాధిని గుర్తించిన తర్వాత అధికారులు ఈ విధంగా ఆదేశాలు జారీ చేశారు.
30 పందులకు పరీక్షలు నిర్వహించగా 19 పందులకు స్వైన్ ఫీవర్ ఉన్నట్లు వ్యవసాయ, మత్స్య, సంరక్షణ శాఖ (ఏఎఫ్‌సీడీ) తెలిపింది. దీంతో పశువైద్యులు 900 కంటే ఎక్కువ పందులను చంపాలని ఆదేశించారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. వచ్చే వారం ప్రారంభంలో పందులను వధిస్తారు. దీనితో పాటు AFCD అధికారులు మూడు కిలోమీటర్ల (రెండు మైళ్ళు) లోపు మరో ఎనిమిది పందుల ఫారాలను తనిఖీ చేసి, పరీక్ష కోసం నమూనాలను సేకరించాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: ఎంపీ డానిష్ అలీని బీఎస్పీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి.. బెడిసికొట్టిన కాంగ్రెస్ స్నేహం!
వండిన మాంసం సురక్షితం
ఇక పందుల్లో వ్యాప్తి చెందుతున్న పుకారు గురించి, పశువైద్యులు మాట్లాడుతూ.. వండిన పంది మాంసాన్ని వినియోగానికి సురక్షితం అని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. హాంకాంగ్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వేగంగా విస్తరిస్తున్నదని, విద్యుత్ షాక్‌లు ఇచ్చి పందులను చంపడానికి ఇదే కారణమని వారు తెలిపారు.
ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది?
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF)కి సంబంధించి, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ (WOAH) స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యాది వ్యాప్తి కొనసాగడం పందుల పరిశ్రమకు ఆందోళన కలిగించే విషయమని చెప్పింది. ఏ ప్రాంతం కూడా దాని బారిన పడకూడదని పేర్కొంది. చాలా సంవత్సరాలుగా, టీకా లేకపోవడం లేదా సమర్థవంతమైన చికిత్స ఈ వ్యాధిని నియంత్రించడం చాలా సవాలుగా మారిందని వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ తెలిపింది.
ఇది కూడా చదవండి: అఫిడవిట్లో 27 లక్షలే, కానీ అల్మారాలో 225 కోట్లు.. కరప్షన్ కింగ్, కాంగ్రెస్ ఎంపీ గురించి తెలుసుకోండి