గాయపడిన ఆవును హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లిన యజమాని : వీడియో

  • Published By: nagamani ,Published On : August 21, 2020 / 12:21 PM IST
గాయపడిన ఆవును హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లిన యజమాని : వీడియో

Updated On : August 21, 2020 / 12:54 PM IST

మనం పెంచుకునే ఆవుకు చిన్న ఇబ్బంది వచ్చినా గబగబా హాస్పిటల్ కు తోలుకెళ్లిపోతాం..ఎలా తీసుకెళ్లతాం..నడిపించుకునే కదా..మహా అయితే చిన్న వ్యాన్ లో ఎక్కించి తీసుకెళతాం. కానీ..ఓ ఆవు యజమాని మాత్రం గాయపడిన తన ఆవును ఏకంగా హెలికాఫ్టర్ పై తీసుకెళ్లాడు. దీనికి సంబంధించని వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆహా..ఆ ఆవుపై ఆ యజమానికి ఎంత ప్రేమో కదా..అంటున్నారు చూసినవారంతా..



వివారల్లోకి వెళితే.. స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వత సానువుల్లోకి మేతకు వెళ్లిన ఆవు గాయపడింది. నొప్పితో విలవిల్లాడుతున్న గోవు కుంటుతూ నడుస్తుండడం చూసిన యజమాని అల్లాడిపోయాడు. అయ్యో నీకు ఎంత కష్టమొచ్చింది. నిన్ను ఎత్తుకుని తీసుకెళదామంటే నాకు సాధ్యం కాదు కదాని వాపోయాడు. కానీ దాన్ని అలాగే నడిపించుకుంటూ తీసుకెళితే ఆగాయం పెద్దది అవుతుంది. దీంతో..ఎలాగైనా సరే ఆవుకు కష్టం కాకుండా తీసుకెళ్లాలని ఏకంగా హెలికాప్టర్ ద్వారా దానిని ఇంటికి తరలించాలని అనుకున్నాడు. వెంటనే సర్వీస్ హెలికాప్టర్‌కు సమాచారం అందించాడు.



వెంటనే ఆవు ఉన్న చోటికి సిబ్బందితో పాటు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది. వెంటనే హెల్పింగ్ టీమ్ ఆ ఆవుకు తాళ్లు కట్టి వలలాంటి బ్యాగ్ లోకి ఎక్కించి దాన్ని హెలికాప్టర్ రింగ్ కు తగిలించారు. వెంటనే హెలికాప్టర్ గాల్లోకి లేచింది. ఆవును సురక్షితంగా యజమాని ఇంటికి తరలించింది. కాగా..ఆ ఆవు గాల్లో ప్రయాణిస్తున్నా..ఏమాత్రం కంగారు పడలేదు..తన కోసం యజమాని పడిన తపన అర్థం అయ్యిందో ఏమో..కుదురుగా..బుద్దిగా గాల్లో ఎగురుతూ వెళ్లింది. అలా ఇంటికి తీసుకెళ్లిన ఆ యజమాని ఆ ఆవుకు తరువాత చికిత్స చేయించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కాగా..ఆ ఆవుపై యజమానికి ఉన్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు. లక్షలాదిమంది ఈ వీడియోను రీట్వీట్ చేస్తున్నారు.