Syria Earthquake: శిథిలాల నుంచి బయటపడ్డ తల్లిని చూసి భావోద్వేగానికి గురైన తనయుడు.. కన్నీళ్లతో గుండె బరువెక్కే దృశ్యం!

ఈ భూకంపం వల్ల కొన్ని కుటుంబాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే, ఇంకొన్ని కుటుంబాల్లో అయినవాళ్లు దూరమయ్యారు. ప్రాణాలతో బయట ఉన్న వాళ్లు.. శిథిలాల కింద ఉన్న తమ వాళ్ల గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు. శిథిలాల నుంచి తమ వాళ్లు క్షేమంగా బయటపడతారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

Syria Earthquake: శిథిలాల నుంచి బయటపడ్డ తల్లిని చూసి భావోద్వేగానికి గురైన తనయుడు.. కన్నీళ్లతో గుండె బరువెక్కే దృశ్యం!

Updated On : February 13, 2023 / 12:19 PM IST

Syria Earthquake: మానవ సంబంధాలు ఏ దేశంలోనైనా ఒకేలా ఉంటాయి. అందులోనూ కుటుంబ సభ్యులపై లెక్కలేనంత ప్రేమ ఉంటుంది. కన్న వాళ్లు, తోబుట్టువులు, రక్తం పంచుకుపుట్టిన పిల్లలు, జీవిత భాగస్వామి.. ఇలా వీళ్లందరూ బాగుండాలనే కోరుకుంటారు ఎవరైనా.

Delhi: తల్లితోపాటు ఫ్యాక్టరీకి వెళ్లిన బాలుడు.. ఎలివేటర్ షాఫ్ట్‌లో చిక్కుకుని మృతి

వీళ్లలో ఎవరికేం జరిగినా ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు అదే బాధను అనుభవిస్తున్నారు టర్కీ, సిరియాల్లో భూకంప బాధితులు. ఈ భూకంపం వల్ల కొన్ని కుటుంబాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే, ఇంకొన్ని కుటుంబాల్లో అయినవాళ్లు దూరమయ్యారు. ప్రాణాలతో బయట ఉన్న వాళ్లు.. శిథిలాల కింద ఉన్న తమ వాళ్ల గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు. శిథిలాల నుంచి తమ వాళ్లు క్షేమంగా బయటపడతారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరిలో కొందరికి నిరాశే ఎదురవుతోంది. ఇంకొందరికి మాత్రం సంతోషం మిగులుతోంది. తమ కుటుంబ సభ్యుల్లో కొందరైనా ప్రాణాలతో బయటపడుతున్నారు.

WPL Auction 2023: మహిళా ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం.. కోటి దాటే ఆటగాళ్లు వీళ్లేనా?

తాజాగా సిరియాలో ఒక వ్యక్తి ఇలాగే అంతులేని ఆనందం, భావోద్వేగానికి గురయ్యాడు. టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంలో దాదాపు 34,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉన్నారేమో అని సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. ప్రాణాలతో ఉన్న వాళ్లు శిథిలాల కింద నుంచి తమ వాళ్లు సురక్షితంగా బయటపడతారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అలా ఒక వ్యక్తి శిథిలాల కింద ఉన్న తన తల్లి కోసం గంటల నుంచి ఎదరు చూశాడు.

Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో.. సోమవారం బెంగళూరులో ప్రారంభించనున్న మోదీ

తల్లి క్షేమంగా బయటపడాలని కోరుకున్నాడు. చివరకు సిరియాకు చెందిన ‘ద వైట్ హెల్మెట్స్’ అనే గ్రూప్‌కు చెందిన సహాయక బృందాలు అతడి తల్లిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశాయి. అప్పటికి ఆమె ప్రాణాలతోనే ఉంది. దీంతో క్షేమంగా బయటపడ్డ తన తల్లిని చూసి, ఆమె తనయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లు పెట్టుకుని, వెక్కివెక్కి ఏడ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ‘ద వైట్ హెల్మెట్స్’ సంస్థ తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లను కూడా భావోద్వేగానికి గురి చేస్తోంది.