Afghanistan : తాలిబన్లను నమ్మొచ్చా ? ఉగ్రవాదుల నోట కశ్మీర్ రాగం
అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల విజయంతో ఉగ్రవాద సంస్థలు కశ్మీర్ రాగాన్ని ఆలపిస్తున్నాయి. ఇస్లామిక్ శత్రువుల నుంచి కశ్మీర్‌కు విముక్తి కల్పించాలని అల్‌ఖైదా సంచలన వ్యాఖ్యలు చేసింది.

Taliban Jk
Taliban In Afghanistan : అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల విజయంతో ఉగ్రవాద సంస్థలు కశ్మీర్ రాగాన్ని ఆలపిస్తున్నాయి. ఇస్లామిక్ శత్రువుల నుంచి కశ్మీర్‌కు విముక్తి కల్పించాలని అల్‌ఖైదా సంచలన వ్యాఖ్యలు చేసింది. తాలిబన్లు మాత్రం కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. భారత్‌పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పాలని చూస్తున్న పాకిస్తాన్‌కు తాలిబన్ల నిర్ణయం గట్టి ఎదురుదెబ్బే. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైనికదళాల ఉపసంహరణతో అల్‌ఖైదా స్వరం పెంచుతోంది. కశ్మీర్‌ను టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేస్తోంది.
Read More : HBD Pawan Kalyan: ఫ్యాన్స్‌కు పండగే.. నేడు నాలుగు అప్డేట్లు!
అఫ్గాన్‌లో తాలిబన్లు విజయం సాధించడంపై శుభాకాంక్షలు చెప్పిన అల్‌ఖైదా … కశ్మీర్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ శత్రువుల చేతుల్లో ఉన్న ప్రాంతాలను విముక్తి కల్పించాలని పిలుపునిచ్చింది. కశ్మీర్‌తో పాటు పాలస్తీనా, యెమెన్, సోమాలియా, లెవాంట్లకు స్వేచ్ఛ కల్పించాలంటోంది. ప్రపంచ వ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న ముస్లిం ఖైదీలందరినీ విముక్తి చేయాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు వెల్లడించింది. తాలిబన్లతో మొదట్నుంచి చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతోంది అప్ఘానిస్తాన్.
Read More : Delhi : టీఆర్ఎస్ చరిత్రలో కీలక మైలురాయి, దేశ రాజధానిలో పార్టీ భవనం
బిన్ లాడెన్‌తో పాటు అల్‌ఖైదా అగ్రనేతలందరికీ ఆశ్రయం కల్పించింది గతంలోని తాలిబన్ ప్రభుత్వం. తాలిబన్లు అధికారంలో ఉన్న సమయంలోనే అల్‌ఖైదా అమెరికాలో దాడులు చేసింది. అమెరికాతో పాటు ప్రపంచాన్నే గడగడలాడించిన ఈ ఘటన తర్వాత అగ్రరాజ్యం అల్ ఖైదాపై విరుచుకుపడటం మొదలుపెట్టింది. 20 ఏళ్ల తర్వాత అమెరికా బలగాలు ఉపసంహరించుకోవడంతో అల్‌ఖైదా మళ్లీ అఫ్ఘానిస్తాన్‌లో అడుగుపెట్టాలని చూస్తోంది. తాలిబన్లను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తోంది.
Read More :Cow Rights : ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించి హక్కులు కల్పించాలి, హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఓ వైపు కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోమంటూ తాలిబన్లు చెబుతున్న సమయంలోనే.. అల్‌ఖైదా చేసిన ఈ ప్రకటన కలకలం రేపుతోంది. తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా పాకిస్తాన్ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కశ్మీర్‌పై తమ వైఖరిని వెల్లడించారు. కశ్మీర్ విషయంతో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. ఇది భారత్-పాకిస్తాన్లకు చెందిన అంశమని, ఇరుదేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తేల్చి చెప్పారు. రెండు పొరుగు దేశాలని, ఒక దేశం హితాన్ని దృష్టిలో పెట్టుకుని మరో దేశం పనిచేయాల్సి ఉంటుందన్నారు.
Read More : Sajjala Ramakrishnareddy : అర్హులందరికీ పెన్షన్స్ ఇస్తున్నాం : సజ్జల రామకృష్ణారెడ్డి
భారత్ కూడా కశ్మీర్ లోయపై పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండాలన్నారు జబీహుల్లా. భారత్‌తో తాము మంచి సంబంధాలనే కోరుకుంటున్నామని చెప్పారు. కానీ.. కశ్మీర్ అంశాన్ని అల్‌ఖైదా తెరపైకి తేవడం ద్వారా.. ఇక్కడి ఉగ్రవాద సంస్థలకు ఊతం ఇచ్చినట్లేనని భావిస్తున్నారు. తాలిబన్ల అండ లేకుండా ఈ తరహా ప్రకటనలు చేసే అవకాశమే ఉండదంటున్నారు.
Read More : Night Curfew : కరోనా కేసులు పెరగటంతో నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం
పైగా ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జైషే జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కూడా తాలిబన్లతో రహస్యంగా చర్చలు జరిపారు. కశ్మీర్లో ఉగ్రదాడులకు సాయం కోరారు. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోమని పైకి తాలిబన్లు చెబుతున్నా.. తెరవెనుక జరుగుతున్న పరిణామాలు మాత్రం ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.