Atlanta Mall Shooting : అట్లాంటా మాల్లో కాల్పులు…ముగ్గురు యువకుల మృతి
అమెరికా దేశంలో మళ్లీ కాల్పులు జరిగాయి. అమెరికాలోని జార్జియా రాజధాని అట్లాంటాలోని షాపింగ్ మాల్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు....

Atlanta Shooting
Atlanta Mall Shooting : అమెరికా దేశంలో మళ్లీ కాల్పులు జరిగాయి. అమెరికాలోని అట్లాంటా నగరంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు యువకులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలోని జార్జియా రాజధాని అట్లాంటాలోని షాపింగ్ మాల్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. (shooting in US city of Atlanta)
Benin Fire : బెనిన్ ఇంధన డిపోలో పేలుడు…34 మంది మృతి
ముగ్గురు యువకులపైకి పిస్టల్‌తో కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. కాల్పుల్లో గాయపడిన ముగ్గురు బాధితులు చికిత్స పొందుతూ మరణించారు. కాల్పుల వెనుక గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుల్లో ఒకరికి 17 ఏళ్లు, మరోకరికి 20 ఏళ్లు, మూడో వ్యక్తి 30 ఏళ్ల వయసు అని పోలీసులు చెప్పారు. మృతులను ఇంకా గుర్తించలేదు.