G-20 Summit: ఇండియాలో జరగనున్న జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడి హాజరుపై క్లారిటీ ఇచ్చిన ఆ దేశ విదేశాంగ మంత్రి

గతేడాది నవంబర్‌లో బాలిలో జరిగిన జీ-20 సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు విందులో కలుసుకున్న తాజాగా ఆసక్తిగా మారింది. ఆ సందర్భంలో ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణను విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది

G-20 Summit: ఇండియాలో జరగనున్న జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడి హాజరుపై క్లారిటీ ఇచ్చిన ఆ దేశ విదేశాంగ మంత్రి

Narendra Modi and Xi Jinping (file photo)

Updated On : July 28, 2023 / 6:22 PM IST

G-20 Summit: ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు హాజరవుతారా? గతేడాది నవంబర్‌లో బాలిలో జరిగిన జీ-20 విందులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? అనే ప్రశ్నలకు తాజాగా సమాధానం దొరికినట్లే అనిపిస్తోంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు.

Karnataka: పార్కింగ్ రద్దీతో చిర్రెత్తుకొచ్చి సీఎం కారుకే అడ్డు తిరిగాడు.. తర్వాత ఏం జరిగిందంటే?

ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు హాజరవుతారా అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీని ప్రశ్నించగా.. ఆహ్వానితులందరి భాగస్వామ్యంతో భారత్ విజయవంతం కావడానికి తాము అన్ని విధాల సహకరిస్తామని బాగ్చీ చెప్పారు. దీంతో జిన్‭పింగ్ కూడా హాజరు అవుతున్నారనే సంకేతాలు పరోక్షంగా ఇచ్చారని అంటున్నారు. ఇక ఈ సమావేశంలో ఆఫ్రికన్ యూనియన్‌ను జీ-20లో శాశ్వత సభ్యదేశంగా చేయాలనే భారతదేశ ప్రతిపాదన సఫలమవుతుందని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై నిర్దిష్టంగా ఏమీ చెప్పలేమని అనడం గమనార్హం.

YouTube challenge: హలో పోలీస్ అంకుల్.. తెల్లటి వ్యానులో వచ్చి నా ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేశాడు అంటూ కలకలం రేపిన బాలిక

ఇక గతేడాది నవంబర్‌లో బాలిలో జరిగిన జీ-20 సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు విందులో కలుసుకున్న తాజాగా ఆసక్తిగా మారింది. ఆ సందర్భంలో ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణను విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, గత ఏడాది నవంబర్‌లో బాలిలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు విందులో చర్చించినట్లు పేర్కొన్నారు.

ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే వెంటనే చేసేయండి. లేదంటే జరిగే నష్టం ఇదే..

భారత్-చైనా సరిహద్దులోని పశ్చిమ సెక్టార్‌లోని ఎల్‌ఏసీ (వాస్తవ నియంత్రణ రేఖ) వెంబడి పరిస్థితిని పరిష్కరించడం, శాంతిని పునరుద్ధరించడం తమ లక్ష్యమని భారతదేశం ఎప్పుడూ చెబుతుందని బాగ్చి గుర్తు చేశారు. మే 2020లో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం ప్రారంభమైన తర్వాత జీ జిన్‌పింగ్, ప్రధాని మోదీ కలుసుకోవడం ఇదే మొదటిసారి. జూలై 24న జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్‌ ఎన్‌ఎస్‌ఏల సమావేశం సందర్భంగా వాంగ్‌తో ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ సమావేశమయ్యారు.