New Zealand : అక్కడ ఒకే ఒక్క కరోనా కేసు.. అయినా దేశవ్యాప్తంగా లాక్ డౌన్

న్యూజిలాండ్ లో ఒక్క కరోనా కేసు నమోదైంది. దేశంలో లాక్ డౌన్ విధించారు. డెల్టా వేరియంట్ గా అనుమానిస్తున్నట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు.

New Zealand : అక్కడ ఒకే ఒక్క కరోనా కేసు.. అయినా దేశవ్యాప్తంగా లాక్ డౌన్

Jacinda Ardern

Updated On : August 17, 2021 / 8:59 PM IST

locked down in New Zealand : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వైరస్ బారిన పడి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మూడో వేవ్ మళ్లీ భయ పెడుతోంది. అయితే కరోనాను కట్టడి చేసే విషయంలో న్యూజిలాండ్  మాత్రం మొదటి నుంచి అప్రమత్తంగానే ఉంటోంది. వైరస్ కట్టడికి అనేక రకాల చర్యలు తీసుకుంటోంది.

తాజాగా దేశంలోని ఆక్లాండ్ లో ఒక్క కరోనా కేసు నమోదు అయింది. అయితే వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం దేశ వ్యాప్తంగా మూడు రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు.

ఈ కేసును డెల్టా వేరియంట్ గా అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమైందని అన్నారు. తాము దానికి తగినట్లు స్పందిస్తున్నామని చెప్పారు. వీలైనంత త్వరగా డెల్టా వేరియంట్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో డెల్టా వేరియంట్ విజృంభణను ప్రస్తావిస్తూ..అలాంటి పరిస్థితులు తమకు రాకుండా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఏడాది తర్వాత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం గమనార్హం.

కరోనా సోకిన వ్యక్తి కోవిడ్ టీకా తీసుకోలేదని ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ ఆప్లే బ్లూమీ్ ఫీల్డ్ తెలిపారు. అతను ఆగస్టు 12 నుంచి వైరస్ తో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. సదరు వ్యక్తి తన భార్యతో కలిసి వారాంతంలో స్థానికంగా పర్యటించారని..రగ్బీ ఆటను చూసేందుకు వెళ్లారని తెలిపారు. ఈ క్రమంలో ఏడు రోజులపాటు లాక్ డౌన్ విధించినట్లు తెలిపారు.