Africa Human Life Expectancy : ఆఫ్రికాలో పదేళ్లు పెరిగిన మనిషి సగటు జీవితకాలం..ఎందుకో తెలుసా?
ఆఫ్రికా ప్రాంతంలో మనిషి సగటు జీవిత కాలం 10 ఏళ్లు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ వో) వెల్లడించింది. 2000 నుంచి 2019 వరకు ఆ మార్పును గమనించినట్లు డబ్ల్యుహెచ్ వో తెలిపింది. కానీ, ఇదే కాలంలో మరే ప్రాంతంలోనూ మనిషి సగటు జీవితకాలం ఈ స్థాయిలో పెరుగలేదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

Africa Human Life Expectancy
Africa Human Life Expectancy : జీవన విధానం, వాతావరణ మార్పుల వల్ల మనిషి జీవిత కాలం క్రమంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. అయితే ఆఫ్రికాలో మాత్రం మనిషి సగటు జీవితకాలం 10 ఏళ్లకు పెరిగింది. ఆఫ్రికా ప్రాంతంలో మనిషి సగటు జీవిత కాలం 10 ఏళ్లు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ వో) వెల్లడించింది. 2000 నుంచి 2019 వరకు ఆ మార్పును గమనించినట్లు డబ్ల్యుహెచ్ వో తెలిపింది. కానీ, ఇదే కాలంలో మరే ప్రాంతంలోనూ మనిషి సగటు జీవితకాలం ఈ స్థాయిలో పెరుగలేదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
తాజాగా కోవిడ్ వల్ల జీవితకాలంపై ప్రభావం పడి ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. ట్రాకింగ్ యూనివర్సల్ కవరేజ్ ఇన్ ఆఫ్రికా రీజన్ 2020 పేరుతో డబ్ల్యూహెచ్‌వో నివేదిక విడుదల చేసింది. ఆఫ్రికాలో ఆరోగ్యకరమైన వ్యక్తి సగటు జీవితకాలం 2000 సంవత్సరంలో 46 ఏళ్లు కాగా, ఆ జీవితకాలం 2019లో 56కి పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
Covid-19 : కరోనా కారణంగా రెండేళ్లు తగ్గిన జీవిత కాలం
అయితే, ప్రపంచ దేశాలతో పోలిస్తే ఆఫ్రికాలో మనిషి సగటు జీవితకాలం 64 కన్నా తక్కువగానే ఉంది. ఆరోగ్య సేవలు మెరుగుపడటం, శిశు సంరక్షణ, వ్యాధుల నిర్మూలన వల్ల ఆఫ్రికాలో సగటు జీవితకాలం పెరిగినట్లు తెలుస్తోంది. హెచ్ఐవీ, టీబీ, మలేరియా వంటి వ్యాధులను కంట్రోల్ చేయడం కూడా ఓ కారణమని అంటున్నారు.