Nima Sarikhani : ఫోటో అంటే ఇది రా మామ.. అందుకే అవార్డొచ్చింది

ఫోటోగ్రఫీ అద్భుతమైన కళ. ఎంతో క్రియేటివిటీతో తీసే కొన్ని ఫోటోలు అబ్బురపరుస్తుంటాయి. ఒక ఫోటో 'వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఆఫ్ ది ఇయర్‌ 2024' కి గాను పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది.

Nima Sarikhani : ఫోటో అంటే ఇది రా మామ.. అందుకే అవార్డొచ్చింది

Nima Sarikhani

Updated On : February 8, 2024 / 12:25 PM IST

Nima Sarikhani : కొన్ని ఫోటోలు చూస్తుంటే అద్భుతంగా ఉంటాయి. వాటిని తీయడం వెనుక ఆ ఫోటోగ్రాఫర్ నైపుణ్యం ఉంటుంది. అసలు ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాలనే ఆలోచన ఎలా వచ్చిందని అబ్బురపడతాం. ‘ఐస్ బెడ్’ పేరుతో యూకే ఫోటోగ్రాఫర్ నిమా సరిఖాని తీసిన అద్భుతమైన చిత్రం ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది. ఆ ఫోటో తీయడం వెనుక అతని కష్టం కూడా ఉందండోయ్.

UK Bans Laughing Gas : ఇక లాఫింగ్ గ్యాస్‌పై నిషేధం…యూకే సంచలన నిర్ణయం

ఫోటోలు ఎన్నో కథలను చెబుతాయి. కొన్ని మనసుని కదిలిస్తాయి. కొన్ని జ్ఞాపకాలను గుర్తు తెస్తాయి. అసలు మనం ఊహించని అంశాల్ని తమ కెమెరాలో అందంగా బంధించి చూపిస్తారు ఫోటో గ్రాఫర్స్. వారి క్రియేటివిటీ అలాంటిది. నిద్రపోతున్న ఎలుగుబంటి ఫోటో అత్యుత్తమ అవార్డును సొంతం చేసుకుంది. అందులో ఏముంది అని అవార్డు వచ్చిందంటారా? మంచు పరుపు మీద ఆదమరచి నిద్రపోతున్న ధృవపు ఎలుగుబంటి ఫోటో చూస్తే అలా అనలేం. నార్వే తీరంలో మూడురోజుల వెతుకులాట తర్వాత వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కెమెరాకి ఈ అందమైన దృశ్యం చిక్కింది. చిన్న మంచు కొండపైకి ఎక్కి ఈ ఫోటోను తీశాడు ఆ ఫోటో గ్రాఫర్. మగ ధృవపు ఎలుగుబంటి ప్రశాంతంగా నిద్రపోతోంది. ఈ ఫోటో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఆఫ్ ది ఇయర్ 2024 కి గాను పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది. నిమా సరిఖానికి అవార్డు తెచ్చిపెట్టింది.

Indian Students : భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు…యూఎస్ ఎన్ని వీసాలు జారీ చేసిందంటే…

నిమా సరిఖానికి ఫోటోకు రికార్డు స్ధాయిలో 75,000 మంది ఓటు వేసి ఛాంపియన్‌గా గెలిపించారు. భూమిపై ఉండే అందాలు.. జంతువుల జీవన విధానంపై ఆసక్తి రేపే విధంగా నిమా సరిఖాని ఫోటో ఉందని నేచురల్ హిస్టరీ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ డగ్లస్ గుర్ చెప్పారు.