Russian Astronaut : సునీతా విలియమ్స్ కోసం క్రూ-9లో అంతరిక్షానికి వెళ్లనున్న రష్యా వ్యోమగామి.. ఇంతకీ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఎవరంటే?

Russian Astronaut : అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలయమ్స్‌ను తిరిగి సురక్షితంగా భూమికిపైకి తీసుకొచ్చేందుకు వెళ్లనున్న స్పేస్ఎక్స్ క్రూ-9 సిబ్బందిలో అలెగ్జాండర్ వ్లాదిమిరోవిచ్ గోర్బునోవ్ కూడా ఒకరు.

Russian Astronaut : సునీతా విలియమ్స్ కోసం క్రూ-9లో అంతరిక్షానికి వెళ్లనున్న రష్యా వ్యోమగామి.. ఇంతకీ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఎవరంటే?

sunita williams from iss meet aleksandr vladimirovich gorbunov

Updated On : September 25, 2024 / 12:44 AM IST

Russian Astronaut aleksandr vladimirovich gorbunov : నాసా వ్యోమగాములు నిక్ హేగ్, రోస్కోస్మోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ‘రెస్క్యూ’ మిషన్‌లో భాగంగా ఈ నెల 26న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. అంతరిక్ష నౌక ఫిబ్రవరి 2025లో బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్‌తో కలిసి తిరిగి భూమికి రానుంది.

గతంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విల్మోర్, సునీతా వ్యోమగాములు అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. విల్మోర్, విలియమ్స్‌ను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో వారిద్దరూ తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయారు.

Read Also : అయ్యో.. సునీతా విలియమ్స్‌ను అంతరిక్ష కేంద్రం నుంచి తీసుకొచ్చే మిషన్‌కు దీనితో ముప్పు

అయితే, వీరిద్దరిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా మిషన్ మొదలుపెట్టింది. ఈ నాసా ఆపరేషనల్ కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా స్పేస్‌ ఎక్స్‌ క్రూ-9 ద్వారా నలుగురు వ్యోమగాములను నాసా అంతరిక్ష కేంద్రానికి పంపనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా “ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ కాంప్లెక్స్ 40 నుంచి సిబ్బంది స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్, డ్రాగన్ అంతరిక్ష నౌకలో బయలుదేరుతారు. హేగ్, గోర్బోనోవ్ స్టేషన్‌లోని ఎక్స్‌పెడిషన్ 72 క్రూలో వీరంతా సభ్యులు అవుతారు, ”అని స్పేస్ ఏజెన్సీ ఒక ప్రెస్‌నోట్ వివరించింది.

నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ కింద స్పేస్ ఎక్స్‌తో ఐఎస్ఎస్‌కి 9 క్రూ రొటేషన్ మిషన్ అవుతుంది. ఎలన్ మస్క్ నేతృత్వంలోని సంస్థ నాసాతో పాటు కొన్ని వాణిజ్య మిషన్ల కోసం ఇప్పటివరకు 9 క్రూతో కూడిన విమానాలను అంతరిక్షంలోకి పంపింది. నిక్ హేగ్ క్రూ-9కి కమాండర్‌గా గోర్బునోవ్‌తో పాటు ఇద్దరు సిబ్బంది కోసం విమానంలో మిషన్ స్పెషలిస్ట్‌గా వ్యవహరిస్తారు. వ్యోమనౌక దాదాపు 6 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండనుంది. వీరిద్దరూ విల్మోర్, విలియమ్స్‌తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్నారు.

అలెగ్జాండర్ గోర్బునోవ్ ఎవరంటే.. :
అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలయమ్స్‌ను తిరిగి సురక్షితంగా భూమికిపైకి తీసుకొచ్చేందుకు వెళ్లనున్న స్పేస్ఎక్స్ క్రూ-9 సిబ్బందిలో అలెగ్జాండర్ వ్లాదిమిరోవిచ్ గోర్బునోవ్ కూడా ఒకరు. ఇంతకీ ఈ రష్యా వ్యోమగామి.. ఈ నెల 2024లో తన మొదటి అంతరిక్ష యాత్రను వ్యోమగామిగా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు.

1990, మే 24న రష్యాలోని జెలెజ్ నోగోర్స్క్‌లో జన్మించాడు. 2014లో మాస్కో ఏవియేషన్ ఇన్సిస్టూట్యూట్ నుంచి పట్టుభద్రుడయ్యాడు. రోస్కోస్మోస్ కాస్మోనాట్ కార్ప్స్ లో చేరడానికి ముందు గోర్బునోవ్ రష్యన్ సాయుధ దళాల వైమానికి దళంలో లెప్టినెంట్‌గా కూడా పనిచేశాడు. ఎనర్జియాలో ఇంజనీర్‌గా పనిచేశాడు. అక్కడ కార్గో స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగాల్లో కూడా అనుభవం పొందాడు.

కాస్మోనాట్‌గా ఎంపిక :
ఈ రష్యన్ వ్యోమగామి ఆగస్టు 2018లో వైద్య పరీక్షలు, శిక్షణా కార్యక్రమాల్లో రోస్కోస్మోస్ కాస్మోనాట్ కార్ప్స్ కు ఎంపిక అయ్యాడు.

స్పేస్ మిషన్స్ ట్రైనింగ్ :
అంతరిక్షంలో మనుగడ సాగేంచేలా గోర్బునోవ్ శిక్షణ, డ్రైవింగ్ వ్యాయామాలు, విమాన డ్రైవింగ్ వంటి శిక్షణలను పూర్తి చేశాడు. నవంబర్ 2020లో నిర్వహించిన పరీక్షంలో ఉత్తీర్ణత సాధించి టెస్ట్ కాస్మోనాట్ అయ్యాడు.

ఈ నెల 26న ఫ్రీడమ్ పేరుతో స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో ఎక్స్ పెడిషన్ 72 సమయంలో గోర్బునోవ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఫ్లైట్ ఇంజనీర్ గా పనిచేయనున్నాడు. ఈ మిషన్‌లో గోర్బునోవ్ నాసా వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి పనిచేయనున్నాడు. కేవ్ కెనావెరల్‌లోని ప్యాడ్ 40 నుంచి మొదటి వ్యోమగామి ప్రయోగం కావడం గమనార్హం.

Read Also : Best Mobile Phones : కొత్త ప్రీమియం ఫోన్ కావాలా? ఈ సెప్టెంబర్‌లో 50వేల లోపు ధరకే బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు మీకోసం..!