Bombs Under school : బడి పునాదుల్లో బాంబుల గుట్ట .. గుర్తించటంతో తప్పిన పెను ప్రమాదం

కొత్త స్కూల్ నిర్మించేందుకు పునాదులు తవ్వుతుండగా వేల సంఖ్యలో బాంబులు లభ్యమయ్యాయి. 1000మంది విద్యార్ధులు ఉండే స్కూలు పునాదుల్లో బాంబులు కనిపించటం..వాటిని గుర్తించటంతో పెను ప్రమాదం తప్పింది.

Bombs Under school : బడి పునాదుల్లో బాంబుల గుట్ట .. గుర్తించటంతో తప్పిన పెను ప్రమాదం

cambodia school under bombs

Updated On : August 16, 2023 / 12:45 PM IST

Bombs Under school : కంబోడియా ఈశాన్య ప్రాంతంలోని క్రాంటీ ప్రావిన్సులో బడి కింద బాంబుల గుట్టను గుర్తించారు. తాకితే పేలిపోయే స్థితిలో ఉన్న వేలాది బాంబులను గుర్తించటంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అధికారులతో పాటు స్కూల్ విద్యార్ధులు, సిబ్బంది కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ బాంబులు పేలితే పరిస్థితి ఎలా ఉండేదో అనే ఊహకే హడలిపోతారు. ఆ స్కూల్లో 1000మందికిపైగా విద్యార్ధులు..వందమందికి పైగా సిబ్బంది ఉన్నారు.

ప్రస్తుతం ఉన్న స్కూల్ పక్కనే కొత్త స్కూల్ నిర్మించటానికి పునాదులు తీస్తుంటే ఏకంగా వేలకొద్దీ బాంబులు బయటపడ్డాయి. వాటిని చూసి హడలిపోయారు. ఏమాత్రం వాటికి ఒత్తిడి కలిగినా పేలిపోయే దశలో అవి ఉన్నాయి. వీటిలో ఆయుధాలు, మందుపాతరలు, రాకెట్‌ లాంచర్లు కలిపి సుమారు 2 వేలకు పైగా ఉన్నాయి. కొత్త స్కూల్ కోసం తవ్వకాలు జరుపుతుండగా ఓ చోట ఒకటీ రెండు ఇలా వరుసగా బాంబులు బయటపడటంతో భయపడిన సిబ్బంది ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వటంతో హుటాహుటిన వచ్చి వాటిని అత్యంత జాగ్రత్తగా తవ్వగా రెండువేలకు పైగా బయటపడ్డాయి.

గతంలో కంబోడియాలో అంతర్యుద్ధం సమయంలో పాతిపెట్టినవిగా అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతంలో జరిగిన అంతర్యుద్ధం 1000మంది విద్యార్థులున్న ఆ స్కూల్ కు కొత్త భవనం నిర్మించేందుకు గోతులు తవ్వుతుండగా కొత్త స్కూల్ నిర్మించటానికి ఆ బాంబులు బయటపడటం..ఎటువంటి ప్రమాదం జరుగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. వాటిలో గ్రెనేడ్లు, రాకెట్‌ లాంచర్లు కూడా ఉన్నాయి.

Judge Shoots Wife : రెస్టారెంట్‌లో చిన్న గొడవ .. భార్యను కాల్చి చంపేసిన న్యాయమూర్తి

ఆ ప్రాంతంలో జరిగిన అంతర్యుద్ధ సమయంలో ఈస్కూల్ ఆయుధ కేంద్రంగా ఉపయోగించారట. ఈ విషయాన్ని కంబోడియన్‌ మైన్‌ యాక్షన్‌ సెంటర్‌ (సీఎంఏసీ) డైరెక్టర్‌ జనరల్‌ (director general of the Cambodian Mine Action Centre)హేంగ్‌ రతానా (Heng Ratana)తెలియపారు. వాటికి ఏమాత్రం ఒత్తిడి తగిలినా పేలిపోయేవని కానీ అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో పెను ప్రమాదం తప్పింది అని అన్నారు.

కాగా 1970 సమయంలో కంబోడియా భయంకరమైన అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంది. ఘర్షణలతో ఎంతగానోఅల్లాడిపోయింది. ఈ అంతర్యుద్ధంతో ప్రజలు తీవ్రమైన ఆకలి బాధలు అనుభవించారు. ఆకలికి తోడు అనారోగ్యాలతో నానా పాట్లు పడ్డారు. ఆకలితో 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే పరిస్థితులు ఎంత భయంకరంగా..హృదయవికారంగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. ఇలా పాతిన మందుపాతరలకు 64 వేల మంది బలయ్యారట. అలాగే 40 వేల మంది కాళ్లు, చేతులు పోగొట్టుకుని అంగవైకల్యంగా మారిపోయారు.