UK PM Boris Johnson: ‘పుతిన్‌కు వ్యతిరేకంగా కలిసి పోరాడదాం’
రష్యాకు వ్యతిరేకంగా నిలబడుతున్న దేశాలన్నీ ఒక తాటిపైకి రావాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రపంచనేతలను ఆహ్వానించారు జాన్సన్.

Boris Johnson
UK PM Boris Johnson: రష్యాకు వ్యతిరేకంగా నిలబడుతున్న దేశాలన్నీ ఒక తాటిపైకి రావాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రపంచనేతలను ఆహ్వానించారు జాన్సన్. యుక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలోనే బ్రిటన్ ప్రధాని సోమవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ ర్యూటేలకు లండన్‌లోని అధికారిక నివాసం డౌనింగ్ స్ట్రీట్‌లో భేటీ అయ్యారు.
బ్రిటన్ సాయుధ దళాల సభ్యులను కలుసుకునేందుకు రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్) స్థావరానికి వెళ్లారు. రష్యా అతిక్రమణ ధోరణి, అరాచకాలను ఎదుర్కొనేందుకు గానూ ప్రపంచవ్యాప్త స్పందన అవసరమని తెలిపారు. ముగ్గురు నేతల భేటీతో ఈ ప్రక్రియ ఆరంభమైందని డౌనింగ్ స్ట్రీట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇక యుక్రెయిన్‌కు ప్రపంచ దేశాల సాయం మరింత వేగవంతం అవుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.
యుక్రెయిన్ నగరాలపై దాడులకు పుతిన్ ఇచ్చిన ఆదేశాలపై ప్రధానులు దృష్టి సారించారు. నేతల మధ్య ద్వైపాక్షిక, త్రైపాక్షిక సమావేశాలు త్వరలోనే ఏర్పాటు కావాలని ప్రధాన మంత్రులు నిర్ణయానికి వచ్చారు. రష్యా చట్ట వ్యతిరేక చర్యలకు, అనాగరిక దాడులకు అంతా సంఘటితంగా వ్యవహరించాలని సూచించారు. యుక్రెయిన్‌కు సంఘీభావంగా నిలవాల్సి ఉందని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.
Read Also: 57ఏళ్ల వయస్సులో తండ్రి అవబోతున్న పీఎం బోరిస్ జాన్సన్
యుక్రెయిన్‌లో బాధిత ప్రజలకు బ్రిటన్ నుంచి ఎప్పటికప్పుడు సాయం అందుతోందని వివరించారు. యుక్రెయిన్‌ను ఆదుకునేందుకు యూకే అదనంగా యుక్రెయిన్ ప్రభుత్వ బడ్జెట్‌కు నేరుగా 100 మిలియన్ డాలర్లను కేటాయించింది. రష్యా చర్యలతో తలెత్తిన యుక్రెయిన్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ సాయం ప్రకటించారు.
యుక్రెయిన్‌కు పలు విధాలుగా వైద్యసాయం, నిత్యావసర వస్తువుల సరఫరా జరుగుతోందని, అత్యవసరంగా సాయం అందాల్సిన వారిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నామని జాన్సన్ తెలిపారు. యుక్రెయిన్‌కు అందించిన ఆర్థిక సాయంతో అక్కడి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాలు, ఇతరత్రా కీలక విషయాలకు ఊతం ఏర్పడుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.